విద్యార్థుల భవిష్యత్తును అంధకారంలో నెట్టేసిన సాయిరాం డిగ్రీ కళాశాల.

ఐదవ సెమిస్టర్ డిగ్రీ ఫలితాలను ఇప్పటికీ విడుదల కానీ వైనం, ఫలితాలు తక్షణమే విడుదల చేయాలి.

విద్యార్థుల భవిష్యత్తును అంధకారంలో నెట్టేసిన సాయిరాం డిగ్రీ కళాశాల.

విద్యార్థుల భవిష్యత్తును అంధకారంలో నెట్టేసిన సాయిరాం డిగ్రీ కళాశాల.*

*ఐదవ సెమిస్టర్ డిగ్రీ ఫలితాలను ఇప్పటికీ విడుదల కానీ వైనం*

*ఫలితాలు తక్షణమే విడుదల చేయాలి.IMG_20240429_130248 *

*సి వై ఎస్ ఎస్ రాష్ట్ర అధ్యక్షుడు మాలోతు సురేష్ బాబు.*

Read More నమిశ్రీ అక్రమాలను అడ్డుకోవాలి..


తొర్రూరు లోని సాయిరాం డిగ్రీ కళాశాల విద్యార్థుల ఐదవ సెమిస్టర్ ఫలితాలు విడుదల చేయాలని సాయిరాం డిగ్రీ కళాశాల ముందు సి వై ఎస్ ఎస్ రాష్ట్ర అధ్యక్షుడు మాలోతు సురేష్ బాబు ఆధ్వర్యంలో కళాశాల విద్యార్థులకు మద్దతుగా ఫలితాలు విడుదల చేయాలని నిరసన కార్యక్రమం తెలియజేశారు.ఈ సందర్భంగా సురేష్ బాబు మరియు విద్యార్థులు మాట్లాడుతూ
కాకతీయ యూనివర్సిటీ పరిధిలో గత మూడు నెలల క్రితం జరిగిన ఒకటి ,మూడు, ఐదవ సెమిస్టర్ డిగ్రీ పరీక్షల్లో భాగంగా మహబుబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణ కేంద్రంలో ఉన్నటువంటి సాయిరాం డిగ్రీ కళాశాల బి ఏ, బి జెడ్ సి, బీఎస్సీ మూడవ సంవత్సరం విద్యార్థులు దాదాపు 200 మంది పరీక్షకు హాజరైతే కాకతీయ యూనివర్సిటీ ఐదవ సెమిస్టర్ ఫలితాలు విడుదలై నెల రోజులు కావస్తున్నా ఇప్పటికీ సాయిరాం డిగ్రీ కళాశాల విద్యార్థుల ఫలితాలు రాక సాయిరాం డిగ్రీ కళాశాల యాజమాన్యం నిర్లక్ష్యంతో, కాకతీయ యూనివర్సిటీ ఫీజుల దోపిడీతో విద్యార్థుల భవిష్యత్తు అంధకారంలో పడేశారని అన్నారు. ఆరవ సెమిస్టర్ పరీక్షలు వచ్చేనెల 6 నుండి ప్రారంభం కానున్న తరుణంలో ఇప్పటివరకు ఫలితాలు విడుదల చేయకపోవడం వల్ల తీవ్ర మనస్థాపానికి గురవుతున్నారని, పై చదువులకు ఇబ్బందులు పడుతున్నామని తీవ్ర మనోవేదనకు గురవుతున్నామన్నారు. సాయిరాం డిగ్రీ కళాశాల యాజమాన్యం ఇంటర్నల్ మార్కులు కలపకుండా యూనివర్సిటీకి చెల్లించాల్సిన బకాయిలు చెల్లించకుండా నిర్లక్ష్యం వహించడంతో విద్యార్థుల ఫలితాలు ఆగాయని అన్నారు. విద్యార్థులు యాజమాన్యానికి సంప్రదించిన యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరించి ఫోన్లు కూడా ఎత్తడం లేదని కలవడం కూడా లేదని అన్నారు.కాకతీయ యూనివర్సిటీ ఎగ్జామినేషన్ బ్రాంచ్ సంప్రదించాలనుకుంటే వారి యొక్క వివరాలు వెబ్సైట్లో సరైన విధంగా లేవని అన్నారు. ఇప్పటికైనా కాకతీయ యూనివర్సిటీ అధికారులు కళ్లు తెరిచి విద్యార్థులకు న్యాయం చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు పవన్, మనోజ్ ,రమేష్, శివ, ఉదయ్, వెన్నెల, హారిక, జాస్మిన్ తదితర విద్యార్థులు 50 మంది పాల్గొన్నారు.

Views: 64
Tags:

Related Posts

Post Comment

Comment List

Latest News

నమిశ్రీ అక్రమాలను అడ్డుకోవాలి.. నమిశ్రీ అక్రమాలను అడ్డుకోవాలి..
ఎల్బీనగర్ నియోజకవర్గ పరిధిలోని మన్సూరాబాద్ డివిజన్ ఆటోనగర్, సర్వే నంబర్–38లో అనుమతులు లేకుండా అక్రమంగా మట్టి త్రవ్వకాలు చేపడుతున్న నమిశ్రీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అండ్ ప్రాజెక్ట్స్ సంస్థపై తక్షణ...
సూర్యతండ గ్రామ సర్పంచిగా కాంగ్రెస్ అభ్యర్థి భుక్యా సక్రి మంగీలాల్
సాతానిగూడెం గ్రామ సర్పంచిగా కాంగ్రెస్ అభ్యర్థి భూక్యా రెడ్యానాయక్
వెంకటాపురం గ్రామాన్ని ఆదర్శ  గ్రామంగా తీర్చిదిద్దుతాం*
ఖమ్మం నగర మేయర్ పునుకొల్లు నీరజ ను పరామర్శించిన మంత్రి తుమ్మల
సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులనే గెలిపించండి 
ఉప్పలచాలక గ్రామ సర్పంచిగా గెలుపొందిన బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి శారద చందు