ఘనంగా యువ జర్నలిస్టు యేసేబు పుట్టినరోజు వేడుకలు

By Khasim
On
ఘనంగా యువ జర్నలిస్టు యేసేబు పుట్టినరోజు వేడుకలు

యర్రగొండపాలెం యువ జర్నలిస్టు ఉప్పలపాటి యేసేబు పుట్టినరోజు వేడుకలు బుధవారం యర్రగొండపాలెంలో సహచర జర్నలిస్టుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు జర్నలిస్టులు మాట్లాడుతూ యువ జర్నలిస్టు ఉప్పలపాటి యేసేబు ఆయన పని చేసిన వివిధ పత్రిల్లో అనేక కథనాలను వెలుగులోకి తీసుకొచ్చి పరిష్కారం మార్గం చూపారని కొనియాడారు. హోదాల కోసం కాకుండా సామాజిక సృహ, సామాజిక భద్రత, సామాజిక బాధ్యత కోసం కృషి చేసేవారని కొనియాడారు. ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు వెలికి తీస్తూ నిత్యం తాడిత, పీడిత, బడుగు బలహీన వర్గాల వారికి బాసటగా నిలుస్తూ వారి అభ్యున్నతి కోసం కృషి చేస్తున్నారని చెప్పారు. అంతేకాకుండా సహచర జర్నలిస్టులకు బాసటగా నిలుస్తూ జర్నలిస్టులకు ఏమైనా సమస్యలు వస్తే వాటి కోసం పోరాడే వ్యక్తి అని పేర్కొన్నారు. అందుకే ఆయనను ఇటు అధికారులు, అటు అన్ని పార్టీల ప్రజా ప్రతినిధులు, నాయకులు గౌరవిస్తారని తెలిపారు. అటువంటి యువ జర్నలిస్టు అయిన ఉప్పలపాటి యేసేబు భవిష్యతుల్లో మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. అనంతరం కేక్ కట్ చేయించారు. సహచర జర్నలిస్టులకు పంచి పెట్టారు. శాలువలు, పూలమాలలు, బొకేలతో ఘనంగా సన్మానించారు. స్వీట్లు పంచారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్టులు షేక్ వలీసాహెబ్, మారపాకుల ఆంజనేయులు, ఆవుల యేసుబాబు, షేక్ నాసర్ వలి, కంచి బాల సుబ్రమణ్యం, షేక్ మహమ్మద్ ఖాసిం, తప్పెట్ల కోటేశ్వరరావు, ఆలేటి అనిల్, ఉప్పలపాటి రమేష్ తదితరులు పాల్గొన్నారు.IMG-20240612-WA1865

Views: 35
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News

ప్రేమలో తప్ప కోపం చూపని వ్యక్తి..చంద్ర బావోజీ.. ప్రేమలో తప్ప కోపం చూపని వ్యక్తి..చంద్ర బావోజీ..
ప్రేమలో తప్ప కోపం చూపని వ్యక్తి..చంద్ర బావోజీ.. నేనావాత్ నరసింహ నాయక్.. ఆర్థిక సాయం అందిస్తున్న నేనావాత్ నరసింహ నాయక్.. రంగారెడ్డి జిల్లా, సెప్టెంబర్ 13 న్యూస్...
యాత్ర దానం ???
నకిరేకల్ బస్టాండ్ లో దొంగలు హల్చల్...?
తెలంగాణ భూముల పరిరక్షణ సమితి నల్లగొండ జిల్లా అధ్యక్షులుగా కాశిమల్ల విజయ్ కుమార్ నియామకం..
శబ్బాష్.. మున్సిపాలిటీ
జనగామ జిల్లా పాలకుర్తి మండలం కేంద్రంలోని కార్మెల్ కాన్వెంట్ హైస్కూల్లో ఘనంగా టీచర్స్ డే వేడుకలు
టిజేఎంయు కొత్తగూడెం అధ్యక్షులుగా రాము నాయక్