అడిగిన అప్పు ఇవ్వకపోతిని
అందుకే నా భార్యాబిడ్డలకు మంత్రాలు చేసిందేమో
భారత నాస్తిక సమాజం రాష్ట్ర కార్యదర్శి గుమ్మడి రాజుల సాంబయ్య
*అనుమానం అనే పిచ్చి తలకెక్కి అమాయక వృద్ధురాలిని హతమార్చాలని చూసిన టిఆర్ఎస్ గ్రామ పార్టీ అధ్యక్షులు
*మంత్రాల నెపంతో దాడులు సరియైనవి కావు
*ఆధునిక యుగంలో ఆటవిక చర్యలను ఖండించండి
*బాధిత కుటుంబానికి బాసటగా నిలుద్దాం
నిజానిర్ధారన లో భారత నాస్తిక సమాజం
న్యూస్ ఇండియా తెలుగు జూన్ 18 ( తెలంగాణ బ్యూరో రిపోర్టర్ వెంకన్న గౌడ్ ) :
నర్మెట్ట మండలం జనగామ జిల్లా
ఆధునిక యుగంలో అనాగరికమైన ఆటవిక చర్యలను ఖండించాల్సినటువంటి ఈ సందర్భంలో మనుషులు మానవ మృగాలు లాగా మారి సాటి మనుషులను హింసించి దాడులు దౌర్జన్యాల పేరుతో చంపాలనుకొనే విధానం సరియైనది కాదని భారత నాస్తిక సమాజం రాష్ట్ర కమిటీ నిజనిర్ధారణ కమిటీ వెల్లడించింది. ఆదివారం నర్మట మండల కేంద్రంలో గత బుధవారం నక్కల సత్తెమ్మ అనే వృద్ధురాలిపై అదే గ్రామానికి చెందిన నక్కల రవి అనే వ్యక్తి ఇద్దరు గొల్ల కులానికి చెందిన వ్యక్తులు ఇద్దరికి ఎలాంటి పాత కక్షలు కానీ ఇండ్లు కానీ వ్యవసాయ భూములు కానీ ఒక దగ్గర లేవు.పోనీ ఇద్దరి వయస్సు ఒకటి కూడా కాదు.నక్కల రవి వయస్సు 28 సంవత్సరాలు బాధిత మహిళ సత్తెమ్మ వయస్సు సుమారు 55 నుండి 60 ఏళ్ళు.ఇద్దరి వృత్తి కూడా ఒకటి కాదండి.రవి రియల్ ఎస్టేట్ చేస్తూ అనతి కాలంలోనే నాలుగు రాళ్లు బాగానే పోగేసుకున్నాడు.అయిన సరే ఈ వృద్ధ మహిళ పైన ఎందుకు అనుమానం కలిగిందో ఎవరు తన మదిలోకి ఆ వృద్ధ మహిళ పేరు చెప్పారో గాని తన కుటుంబంలోని భార్యాపిల్లలకు అనారోగ్యం చేస్తుండటంతో నక్కల సత్తెమ్మపై అనుమానం పెంచుకొని ఆ రోజు రాత్రి గ్రామంలో మంది హెచ్చుల కళాకారులు ఊరిలో కథ చెపుతుంటే కథ దగ్గరికి పక్కింటి చాకలి సాయమ్మ గొల్ల పోచమ్మ ఇంకో మహిళ తో కలిసి పోయి కథ చూసి వస్తున్న సత్యమ్మ మీద రాత్రి సుమారు 11-30 గంటల ప్రాంతంలో గ్రామ బొడ్రాయి వద్దకు ముక్సు ధరించి వెంట తెచ్చుకున్న గొడ్డలి తో చాలా ఉన్మాదంగా ప్రేరేపితుడైన నక్కల రవి వృద్ద మహిళ అని చూడకుండా అత్యంత దారుణంగా తలపైన నరకడాని ప్రత్యక్ష సాక్షులు పోలీసులకు చెప్పినట్లు సమాచారం. ఒక్క గొడ్డలి దెబ్బకు నేల కూలిన సత్తెమ్మను పాణం పోయిందా లేదా అని కింద పడిపోయిన వృద్ధురాలిని లేపి మళ్ళీ ఇంకో దెబ్బ కొట్టాడు ఆ దెబ్బ మిస్సైనది. దానితో చనిపోయిందని నిర్దారించుకొని అక్కనుంచి పరారయ్యాడు .పక్కనే ఉన్న సదరు మహిళలు అతి కష్టం మీద ఇంటి దాకా తీసుకుని వచ్చారు.ఆ రాత్రి ఊరిలో ఉన్న ఏ ఒక్క గ్రామీణ వైద్యులు రాలేదు 108 ద్వారా జనగామ ఏరియా ఆసుపత్రికి తరలించారు. అక్కనుంచి వరంగల్ ఎమ్ జి ఎమ్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ప్రాణాపాయం లేదు కానీ .ఆ కుటుంబానికి కనీసం పలకరించే వారు లేక కనీసం ఓదార్పు కోసం ఏ రాజకీయ పార్టీల నాయకులు ఆ ఇంటి వైపు వెళ్లిన దాఖలాలు లేవు.చుట్టాలు కూడా ఎవరు రాకపోవడంతో సత్తెమ్మ కోడలు ఇద్దరు చిన్న పిల్లల తల్లి పోచమ్మ భయం భయం తో ఇబ్బంది పడుతున్నారు. మేము వెళ్ళితే మమ్మల్ని చూసి నాకు ఏమి తెలియదు మా ఇంటిలో ఎవరు లేరు నాకు ఏమి తెలియదు అనే ఆమె మాటలు చూసి మేము ఆమెను మీ కుటుంబానికి మనోధైర్యం కల్పించాలని వచ్చామని నమ్మించడానికి సుమారు గంట పైనే పట్టింది.చివరికి సత్తెమ్మ కుమారుడైన ఆంజనేయులు వికలాంగుడు ) ఆయనతో ఫోన్ లో మాట్లాడితే తప్ప సత్తెమ్మ కోడలు మమ్మల్ని ఇంటిలోకి రానివ్వలేదంటే ఎంత అబద్రత లో ఆ కుటుంబం ఉన్నదో అర్ధం చేసుకోవచ్చు. తమ కున్న 3 ఎకరాల పొలంలో పని చేసుకొని ఇంటికి ఉన్నదో లేనిదో తిని వాళ్ళింట్ల వాళ్ళు వుండే స్వభావం ఆ కుటుంబానిది.సత్తెమ్మ కూతురు పెండ్లి అప్పుడు రవి కుటుంబాన్ని అప్పు అడిగింది వాళ్ళు ఐబీవలేదు .ఈ సంభాషన తప్ప ఆ రెండు కుటుంబాల మధ్య ఎప్పుడు ఇంకే రకమైన మాటలు కానీ చేతలు కానీ గతంలో ఎన్నడూ జరుగలేదు.ఇలాంటి సందర్భంలో రవి కి భార్య ఇద్దురుపిల్లలు వారు జనగమలో వుంటారు.అప్పుడప్పుడు నర్మెట్ట కు వస్తుంటారు.నర్మెట్ట కు వచ్చినప్పుడు రవి భార్య బిడ్డలు అనారోగ్యనికి గురిఅవుతారు. దానికి కారణమ్ సత్తెమ్మ అని నమ్మి రవి ఈ దాడికి ఒడిగట్టాడు.
సభ్య సమాజం తలదించుకునే చర్యగా భారత నాస్తిక సమాజం అభివర్ణిస్తుంది .ఈరోజు నర్మట గ్రామంలో స్థానిక పోలీస్ స్టేషన్ లోని ఎస్ఐ శ్రీకాంత్ మరియు బాధిత మహిళా ఇంటికి వెళ్లి చుట్టుపక్కల ఇండ్ల వారిని విచారించి నిజనిర్ధారణ జరపడం జరిగింది. ఈ సందర్భంగా నిజనిర్ధారణ కమిటీ సభ్యులు కంప్యూటర్ యుగంలో ప్రపంచమంతా దూసుకెళ్తుంటే మంత్రాల నేపంతో సమాజాన్ని వెనక్కి తీసుకెళ్లే చర్యలు సరి అయినవి కావని దీనిమీద సంబంధిత శాఖల అధికారులైన పోలీసులు తదితర శాఖల వారు ఇలాంటి అనామకుల పట్ల విజ్ఞానవంతమైన చైతన్యాన్ని రగిలించేందుకు భారత నాస్తిక సమాజం ఇతర సాంఘిక సంఘాల సమిష్టి కృషితో ప్రజలను చైతన్యవంతం చేయాల్సిన అవసరం ఉందని వారు అన్నారు. ఆ గ్రామంలో అనేకమంది ఆ కుటుంబం పట్ల ఒక రకమైన అణచివేతకు వెలువేతకు గురి చేస్తున్నట్టుగా వాళ్ళు మానసిక సంఘర్షణకు లోనవుతున్న ఈ సందర్భంలో సామాజిక సాంఘిక అభ్యుదయ సంఘాలు నాయకులు ఆ కుటుంబానికి బాసటగా నిలవాల్సిన అవసరం ఉందని భారత నాస్తిక సమాజం విజ్ఞప్తి చేస్తున్నది .నిజనిర్ధారణ కమిటీ పాల్గొన్నవారు భారత నాస్తిక సమాజం రాష్ట్ర కార్యదర్శి గుమ్మడి రాజుల సాంబయ్య. విసీ కే పార్టీ తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు చెరుపల్లి ఆనంద్. బానస రాష్ట్ర నాయకులు తుంగ రాములు .తూడి ప్రసాద్.తమ్ముడి నవీన్ కుమార్. గంగారపు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
Comment List