మహబూబాబాద్ పట్టణం ఏబి ఫంక్షన్ హాల్లో  మెగా జాబ్ మేళా 

తొర్రూర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ కే జగదీష్ 

మహబూబాబాద్ పట్టణం ఏబి ఫంక్షన్ హాల్లో  మెగా జాబ్ మేళా 

నిరుద్యోగ యువతీ యువకులకు ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని పోలీస్ హెడ్ క్వార్టర్స్ కి వెళ్లేదారిలో ఉన్న ఏ బి ఫంక్షన్ హాల్ నందు జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్ ఆధ్వర్యంలో తేదీ 8-10-2024 రోజున మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు  తొర్రూర్ పట్టణ సీఐ  కే జగదీష్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టెన్త్, ఇంటర్, డిగ్రీ పూర్తిచేసిన యువతీ యువకులకు ఈ జాబ్ మేళా ద్వారా పాల్గొంటున్న  40 కి పైగా వివిధ కార్పొరేట్ కంపెనీలలో రెండు వేల ఉద్యోగాలు ఉంటాయని వాటిని సాధించేందుకు  పైన తెలిపిన QR కోడ్ ద్వారా online లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని ఆసక్తి గల అభ్యర్థులను కోరారు. ఈ జాబ్ మేళా ఉదయం 9 గంటల వరకే వారి యొక్క సర్టిఫికెట్లతో ఫంక్షన్ హాల్ కు  హాజరై ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తొర్రూరు మండల  నిరుద్యోగ యువతీ యువకులను వారు  కోరారు. అంతేకాకుండా  ఈ ఉద్యోగాలలో ఎంపికైన వారికి  12 వేల రూపాయల  ప్రారంభ కనీస వేతనంతో ఉపాధి పొందవచ్చు అని తెలిపారు.

Views: 262
Tags:

Related Posts

Post Comment

Comment List

Latest News

మంగళ్పల్లిలో ఆక్రమణల తొలగింపు.. మంగళ్పల్లిలో ఆక్రమణల తొలగింపు..
మంగళ్పల్లిలో ఆక్రమణల తొలగింపు.. రోడ్డు ఆక్రమణలను తొలగిస్తున్న జిహెచ్ఎంసి టౌన్ ప్లానింగ్ అధికారులు ఆదిభట్ల, ఆగస్టు 19 న్యూస్ ఇండియా ప్రతినిధి: మంగళ్పల్లిలో ప్రధాన రహదారిపై ఆక్రమణలపై...
గుడుంబా నిర్మూలనకు పోలీసుల కఠిన చర్యలు
తొర్రూరులో ఎంజీ1 ఈవీ స్కూటర్ల గ్రాండ్‌ లాంచింగ్‌...
గుడుంబా స్థావరాలపై పోలీసుల ఉక్కుపాదం
ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ మృతి ఘటనకు కారణమైన నిందితుల అరెస్ట్
న్యాయవాదిపై దాడిని నిరసిస్తూ తొర్రూరు బార్ అసోసియేషన్ విధుల బహిష్కరణ
తొర్రూరులో గుడుంబాపై పోలీసుల దాడులు