దీపావళి కానుకగా - అక్కా చెల్లెమ్మలకు ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు..!

మహిళాభ్యుదయమే టీడీపీ కూటమి ప్రభుత్వ లక్ష్యం.

On
దీపావళి కానుకగా - అక్కా చెల్లెమ్మలకు ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు..!

- జిల్లా తెలుగు మహిళ అధికార ప్రతినిధి - నరవ శశిరేఖ వెల్లడి...

న్యూస్ ఇండియా ప్రతినిధి/ పెద్దకడుబూరు మండలం అక్టోబర్ 25 :- శుక్రవారం పెద్దకడుబూరు మండలంలో నిర్వహించిన పత్రికా ప్రకటనలో జిల్లా తెలుగు మహిళ అధికార ప్రతినిధి నరవ శశిరేఖ మాట్లాడుతూ మహిళాభ్యుదయమే టీడీపీ కూటమి ప్రభుత్వం లక్ష్యమని పేర్కొన్నారు. తెలుగింటి ఆడపడుచులకు ఎన్నికల ముందు "సూపర్ సిక్స్" ద్వారా కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలలో భాగంగా సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచిత ఇచ్చే పథకానికి రాష్ట్రం మొత్తంగా రిజిస్ట్రేషన్లు, బుకింగ్లు ప్రారంభమయ్యాయని అన్నారు. అతి త్వరలోనే దీపావళి పండుగ సందర్భంగా అక్కా చెల్లెమ్మలకు ఉచిత గ్యాస్ సిలిండర్ ఇచ్చి వాళ్ల కళ్ళల్లో ఆనందాన్ని చూడాలన్న కూటమి నేతల కల దీపావళి పండుగ రోజున నెరవేరబోతుందన్నారు. అర్హత కలిగిన ప్రతి ఒక్కరు ఈ పథకాన్నీ సద్వినియోగం చేసుకొని, కూటమి ప్రభుత్వాన్ని మనస్ఫూర్తిగా ఆశీర్వదించాలని ప్రజలను కోరారు. "మాది మాటల ప్రభుత్వం కాదు - చేతల ప్రభుత్వమని" నిరూపించడం జరుగుతుందన్నారు. ఇప్పటికే కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలలో భాగంగా పెన్షన్ల పెంపు, ఉచిత ఇసుక, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, మెగా డీఎస్సీ, గ్రామసభల ద్వారా మౌలిక సదుపాయాల గుర్తింపు, సిసి రోడ్లకు, డ్రైన్లకు శంకుస్థాపనలు ఇలా ఎన్నో కార్యక్రమాలు ప్రారంభించబడ్డాయని పేర్కొన్నారు. ఇదంతా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, పీఎం నరేంద్ర మోడీ మరియు డిప్యుటీ సిఎం పవన్ కళ్యాణ్ ఆలోచనలు మరియు కృషి వల్లనే సాధ్యపడింది, అలాగే రాబోవు రోజుల్లో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రూపురేఖలే మారబోతున్నాయని ఆమె ప్రజలకు వివరించారు...IMG_20241025_162915

Views: 56
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News

గ్రానైట్ లారీలతో వరుస ప్రమాదాలు  గ్రానైట్ లారీలతో వరుస ప్రమాదాలు 
15 రోజులు వ్యవధిలోనే వద్ద మరో ప్రమాదం నాంచారి మడూరు గ్రామం జాతీయ రహదారిపై ప్రమాదం ఇంట్లోకి దూసుకెళ్లిన లారీ మహిళ కు గాయాలుపట్టించుకోని  సంబంధిత అధికారులు...
శ్రీ ఇందు ఇంజినీరింగ్ కాలేజీ భవనం పైనుంచి పడి ఒడిశా కార్మికుడు మృతి..
బల్దియా అంటేనే అవినీతి కంపు..!
కాంగ్రెస్ కార్యాలయానికి భూమి కేటాయింపు
వరిదాన్యం కేంద్రాలపై సమీక్ష సమావేశం
తొర్రూర్ బస్టాండ్ సెంటర్లు గ్రానైట్ లారీ బోల్తా
తొర్రూర్ బస్టాండ్ సెంటర్లో గ్రానైట్ లారీ బోల్తా