ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు మొదటి బిల్లు మంజూరు..

On
ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు మొదటి బిల్లు మంజూరు..

ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు మొదటి బిల్లు మంజూరు..

IMG-20250720-WA0445
ఇందిరమ్మ ఇళ్లు మొదటి బిల్లు చెక్కును అందిస్తున్న ఇందిరమ్మ కమిటీ సభ్యులు

ఇబ్రహీంపట్నం, జూలై 20, న్యూస్ ఇండియా ప్రతినిధి: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు మొదటి బిల్లు మంజూరు అయ్యింది. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం మంచాల మండలంలో ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి సహకారంతో నిరుపేదలకు ఇందిరమ్మ ఇల్లు నిర్మించే కార్యక్రమంలో భాగంగా ఆదివారం జాపాల గ్రామానికి చెందిన కొమ్ము అమృతమ్మ కు మొదటి బిల్లుగా ఒక లక్ష రూపాయలు మంజూరు కావడంతో లబ్ధిదారురాలితో కలిసి మిగతా పనులను త్వరగా పూర్తి చేయాలని దసరా లోపు గృహప్రవేశం చేయాలని ఇందిరమ్మ కమిటీ సభ్యులు కోరారు. అనంతరం జాపాల గ్రామంలో నిర్మాణం జరుగుతున్న ఇందిరమ్మ ఇళ్ళను పరిశీలించి పనులను త్వరగా పూర్తిచేసి బిల్లులను పొందాలని ఇందిరమ్మ కమిటీ సభ్యులు లబ్ధిదారులను కోరారు. ఈ కార్యక్రమంలో ఇందిరమ్మ కమిటీ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.

Views: 1

About The Author

Post Comment

Comment List

Latest News