అంగన్వాడీలకు కనీస వేతనం అమలు చేయాలి  మాల మహానాడు రాష్ట్ర పోలిట్ బ్యూరో చైర్మన్ ఆ శోద భాస్కర్

అంగన్వాడీలకు కనీస వేతనం అమలు చేయాలి  మాల మహానాడు రాష్ట్ర పోలిట్ బ్యూరో చైర్మన్ ఆ శోద భాస్కర్

IMG-20230923-WA0159
రాష్ట్రంలో అంగన్వాడీ కేంద్రాల్లో పని చేస్తున్న కార్యకర్తలు, ఆయాలకు కనీస వేతనం అమలు చేయాలని జాతీయ మాల మహానాడు రాష్ట్ర పోలిట్ బ్యూరో చైర్మన్ అసోద భాస్కర్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. శనివారం మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయం ఎదుట 13 రోజులుగా అంగన్వాడీలు చేస్తున్న నిరవధిక దీక్షకు మాల మహానాడు ఆధ్వర్యంలో సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షులు కారం ప్రశాంత్ తో కలిసి మాట్లాడుతూ చాలీచాలని వేతనంతో ఎన్నో ఏళ్లుగా గర్భిణీలు, బాలింతలు పిల్లలకు ప్రభుత్వం అందించే ఆహార పదార్థాలను అందిస్తూ సేవ చేస్తున్న అంగన్వాడీలను రాష్ట్ర ప్రభుత్వం గుర్తించాలన్నారు. వారి న్యాయమైన డిమాండ్లు పరిష్కరించకుంటే ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మాల మహానాడు గ్రామ శాఖ అధ్యక్షులు బూరుగుల రజిని కుమార్, నేతలు మద్దెల రమేష్, బాణాల సంజీవ, బొడ్డు రమేష్, గారా అనిల్, అంగన్వాడి కార్యకర్తలు ఆయాలు తదితరులు ఉన్నారు.

Views: 85
Tags:

Related Posts

Post Comment

Comment List

Latest News

సమాజ హిత "విజయ"గర్వం... సమాజ హిత "విజయ"గర్వం...
సమాజ హిత "విజయ"గర్వం  సమాజ హితం కోరే సైనికుడు నా కొడుకు:మాచన విజయ  సమాజ హితం కోరే సైనికుడు  నా కొడుకు:మాచన విజయ.. మే రెండవ ఆదివారం(ప్రపంచ...
జిల్లాలో బాలికల, విద్యార్థినిల, మహిళల కు ‘సంగారెడ్డి జిల్లా పోలీసు షీ-టీమ్స్ రక్షణ’.
నిందితులకు న్యాయస్థానం ముందు శిక్ష పడినప్పుడే, ప్రజలలో పోలీసులపై నమ్మకం పెరుగుతుంది.
ఇస్నాపూర్ లో చిరు వ్యాపారులను 'ఛిద్రం' చేస్తున్న తై -బజార్.!!!
అక్రమ గంజాయి రవాణా పై సంగారెడ్డి జిల్లా పోలీసుల ఉక్కు పాదం.
మిల్లుల వద్ద ధాన్యం దిగుమతిలో జాప్యానికి తావులేకుండా చర్యలు.
భూ భారతి రెవెన్యూ సదస్సులలో వచ్చిన భూ సమస్యలను త్వరిత గతిన పరిష్కరించాలి. -జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు