శేరిలింగంపల్లి లో బీజేపీ జెండా ఎగురవేయాలి - నాగోజీ నాగరావ్.

ప్రతి కార్యకర్త బూత్ స్థాయి నుండి పార్టీ ని బలోపేతం చేయాలి - మునిరత్నం నాయుడు

On
శేరిలింగంపల్లి లో బీజేపీ జెండా ఎగురవేయాలి - నాగోజీ నాగరావ్.

ప్రతి ఒక్కరు రెట్టింపు ఉత్సహంతో పని చేసి శేరిలింగంపల్లి లో బీజేపీ జెండా ఎగురవేయాలి - గజ్జల యోగానంద్ ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో బీజేపీ పార్టీని మరీంత బలోపేతం చేసే దిశగా అసెంబ్లీ స్థాయి సమావేశాలు నిర్వహిస్తున్న క్రమంలో సోమవారం స్థానిక చందానగర్ క్రిస్టల్ గార్డెన్స్ నందు నిర్వహించిన అసెంబ్లీ సమావేశానికి ముఖ్య అతిధి గా బిజెపి రాష్ట్ర కార్యదర్శి నాగోజీ నాగరావ్ మరియు కర్ణాటక రాష్ట్ర శాసనసభ్యులు మునిరత్నం నాయుడు హాజరు అయ్యారు. ఈ సందర్బంగా నాగోజీ నాగరావ్ మరియు మునిరత్నం నాయుడు మాట్లాడుతూ ప్రతి కార్యకర్త బూత్ స్థాయి నుండి పార్టీ ని బలోపేతం చేయాలని, ఎన్నికల సమయం దగ్గరికి వస్తున్న తరుణంలో అహర్నిశలు పార్టీ గెలుపుకై కృషి చేయాలని, ఎన్నికల సమయం కావున అందరు రెట్టింపు ఉత్సహంతో పని చేసి శేరిలింగంపల్లి లో బీజేపీ జెండా ఎగురవేయాలని దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్బంగా శేరిలింగంపల్లి కంటెస్టెడ్ ఎం.ఎల్.ఎ , యోగానంద్ మాట్లాడుతూ శేరిలింగంపల్లి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలని దృడమైన సంకల్పం నిబద్ధత తో ఎన్నో సంవత్సరాలుగా పని చేస్తున్న కార్యకర్తలందరికీ అభినందనలు తెలుపుతూ, కార్యకర్తలందరు పార్టీ ఆదేశాలకు కట్టుబడి, నిరంతరం ప్రజలలో ఉంటూ బీజేపీ పార్టీ బలోపేతానికి, గెలుపుకు కృషి చేయాలనీ పిలుపు నిచ్చారు. జరగబోయే సార్వత్రిక ఎన్నికలలో పార్టీ ఎవరికి అవకాశం ఇచ్చినా నిబద్దతో పనిచేయాలని, శేరిలింగంపల్లి నియోజకవర్గం లో బీజేపీ జెండా రెపరెపలాడే దిశగా ప్రతి ఒక్కరు పని చేయాలని, బిజెపి భారీ మెజారిటీ తో గెలుస్తుందని యోగానంద్ ధీమా వ్యక్తం చేశారు. ఈ అసంబ్లీ స్థాయి సమావేశం లో బూత్ అధ్యక్షులు, శక్తి కేంద్రాల ఇన్చార్జులు ఆ పై స్థాయి నాయకులు, డివిజన్ అధ్యక్షులు, రాష్ట్ర, జిల్లా, అసెంబ్లీ, డివిజన్ నాయకులు మరియు డివిజన్ మోర్చా అధ్యక్షులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ప్రతి ఒక్కరు రెట్టింపు ఉత్సహంతో పని చేసి శేరిలింగంపల్లి లో బీజేపీ జెండా ఎగురవేయాలి - గజ్జల యోగానంద్

Views: 40
Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

ఎన్నికలు సజావుగా జరిగేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలి ఎన్నికలు సజావుగా జరిగేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలి
విలేకరుల సమావేశంలో డిఎస్పి ఆదినారాయణ
27 డివిజన్ నుంచి భారీ మెజార్టీతో గెలిపించండి: మద్దెల సుధారాణి 
వైద్య సేవ నుంచి ప్రజా సేవకు 11వ వార్డు బరిలో డాక్టర్ పొనుగోటి సోమేశ్వరరావు
అభివృద్ధికి గుర్తు కమలం పొంగులేటి సుధాకర్ రెడ్డి
తొర్రూర్ మున్సిపాలిటీ 8వ వార్డులో ఎమ్మెల్యే యశస్విని రెడ్డి వినూత్న ఇంటింటి ప్రచారం
ఆడబిడ్డను ఆదరించి మున్సిపాలిటీకి పంపించాలని కోరుతూ, తొర్రూరు మున్సిపాలిటీ 9వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి పంజా కల్పన
ఔరవాణి గ్రామంలో బి ఆర్ ఎస్ గ్రామ అధ్యక్షుడిగా ముక్కాముల శ్రీనివాస్ ఎన్నిక