పల్లె పల్లెకు బి.సి.వై పార్టీ

గడప గడపకు మీ వెంకటేశ్వర్లుయాదవ్

By Venkat
On
పల్లె పల్లెకు బి.సి.వై పార్టీ

కార్యక్రమంలో భాగంగా ధర్మారం,

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా
 భారత చైతన్య యువజన పార్టీ మేడ్చల్ నియోజకవర్గంలో బోడె రామచంద్ర యాదవ్ ఆదేశాలమేరకు పల్లె పల్లెకు బి.సి.వై పార్టీ -గడప గడపకు మీ వెంకటేశ్వర్లుయాదవ్ కార్యక్రమంలో భాగంగా ధర్మారం, తిమ్మాయిపల్లి,హరిదాసుపల్లి,చీర్యాల,హమీద్ గూడా,రాంపల్లి గ్రామాల్లో విస్తృత స్థాయి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించడం జరిగింది.ఆయా గ్రామాల్లో  బి.సి.వై పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ఓరుగంటి వెంకటేశ్వర్లు యాదవ్ కి భారీఏత్తునమద్దత్తు తెలుపుతూ గ్రామాల్లోకీ స్వాగతం పలికారు.అనంతరం ఓరుగంటి వెంకటేశ్వర్లు యాదవ్ గారు మాట్లాడుతూ అన్ని రాజకీయ పార్టీలు ప్రజల ఓట్లు దండుకుని  వారి జీవితాలను గాలికి వదిలేశాయని ఉపాధి లేక ఆకలి కేకలతో ప్రజలు అలమటిస్తుంటే  ఈ పార్టీల అగ్రనేతలు రాజకీయ రాక్షస క్రీడలో ప్రజలను అయోమయానికి గురి చేస్తున్నాయని ప్రజలనుంచి  దోచుకున్న డబ్బుతో ఆస్తుల కంటే ,ధనం కంటే విలువైన వజ్రాయుధం లాంటి మీ ఓటు కొని మళ్ళీ అధికారంలోకి రావాలని కలలు కంటున్నయని, దయచేసి మోసపోవద్దని సమాజంపట్లా భాధ్యత కలిగి నిరంతరం ప్రజల జీవితాల్లో వెలుగులు నింపేందుకు ఆలోచిస్తు కృషీ చేస్తున్న వ్యక్తీ బోడే రాంచంద్రయాదవ్ గారు వారి నాయకత్వంలో భారత చైతన్య యువజన పార్టీని ఏర్పాటు చేసుకుని వచ్చామని మీకు సేవ చేసుకునే ఒక్క అవకాశం ఇస్తే  ఈ మేడ్చల్ జిల్లా అభివృద్ధి అంటే ఎంటో చేసి చూపిస్తా అని,దయచేసి అగ్రవర్ణ దోపిడి దారుల నాయకత్వంలో ఉన్న పార్టీలకు ఓట్లు వేయవద్దని రైతే రాజు అని రైతులను ఈ పార్టీలు మోసం చేశాయనీ, అన్ని వర్గాల ప్రజలకు రాజ్యాంగ బద్ధమైన పాలనను అందించాలని, అద్భుతమైన మేనిఫెస్టోతో బి.సి.వై పార్టీ మీ ముందుకు వచ్చిందని,బి.సి లకు చట్టసభల్లో 50% సీట్లు ఇప్పటివరకు చట్టసభలు వెళ్ళని కులాలకు ప్రాధాన్యం చట్టసభల్లో బి.సి లకు రిజర్వేషన్ల కోసం పోరాటం, అన్ని కులాల గణన చేసి సంఖ్య ఆధారంగా ప్రాధాన్యత బి.సి విద్యార్థులకు అంతర్జాతీయ ప్రమాణాలతో ప్రత్యేక విశ్వవిద్యాలయం ఏర్పాటు, రాష్ట్రంలో ప్రతి దళిత కుటుంబానికి రెండు ఎకరాల భూ పంపిణీ, వ్యక్తిగత నిర్మాణాలు చేపట్టే వారికి ఇసుక పూర్తిగా ఉచితంగా అందించడం, ఇనుము, సిమెంట్ ధరల్లో సిండికేట్ వ్యవస్థను నియంత్రించి నామమాత్రపు ధరలకే అందిస్తాం, రాష్ట్రంలో 30 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులకు ప్రభుత్వ పరంగా గుర్తింపు కార్డులు ఏడాదిలో మూడు నెలలు ప్రతి కుటుంబానికి రేషన్, నిత్యావసర సరుకులు పంపిణీ పేద, మధ్య తరగతి కుటుంబాలకు నిత్యవసర ధరా భారం కాకుండా ప్రతి నియోజకవర్గంలో మహిళల కోసం ప్రత్యేకంగా మార్ట్ ను ఏర్పాటు చేసి ప్రతి నెల రాయితీలో సరుకులు ఇస్తామని, ప్రస్తుతం రెండు లక్షలు ఉన్న ఉద్యోగుల ఆరోగ్య బీమా లో అపరిమితం ఎంతైనా వాడుకోవచ్చని, ఎస్సీ ఎస్టీ బి.సి లతో సహా కులానికి సంబంధం లేకుండా పేద రైతు బిడ్డలకు పూర్తిగా విదేశీ విద్య ఖర్చు ప్రభుత్వమే భరిస్తుందని ఇప్పుడున్న పంట రుణాలు మొత్తం పూర్తిగా మాఫీ చేసి కౌలు రైతుల కోసం ప్రత్యేక చట్టం కౌలు పూర్తిగా ప్రభుత్వమే చెల్లిస్తుందని, బి.సిలకు ప్రత్యేక రక్షణ చట్టం తీసుకొస్తామని రాష్ట్రంలో ప్రతి పౌరునికి ఉచితంగా విద్య, వైద్యం అందిస్తామని చదువుకున్న ప్రతి ఒక్కరికి ఉపాధిని కల్పిస్తామని, ప్రతి కుటుంబానికి ఒక పాడియావును అందించి ఆరోగ్య ఆర్థిక పరిపుష్టిని ప్రతి కుటుంబానికి చేరువ చేస్తామని ఇలాంటి అనేక అద్భుతమైన అంశాలతో పేదరికం నిరుద్యోగం లేని మేడ్చల్ జిల్లాగా మారుస్తామని ,30వ తేదీన జరిగే ఎన్నికల్లో చేరకు రైతు గుర్తుకు ఓట్లు వేసి భారీ మెజారిటీతో బి.సి.వై పార్టీ అభ్యర్థి ఓరుగంటి వెంకటేశ్వర్లు యాదవ్ ని గెలిపించుకోవాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు అంజి యాదవ్, వెంకట్ యాదవ్, సాయికుమార్, మహమ్మద్ పాషా, రమేష్, ఎల్లం, సాయి, సత్యనారాయణ, సతీష్, శ్రీనివాస్, సరస్వతి, మరియు కార్యకర్తలు మరియు తదితరులు పాల్గొన్నారు.IMG-20231118-WA0700

Views: 11
Tags:

About The Author

Post Comment

Comment List

Latest News