మూడో నెంబర్ "గుర్తుం"దా...!

సింగిల్ హ్యాండ్ కి  ఓటు వేయండి

On
మూడో నెంబర్

ఆర్ఆర్ఆర్ ని గెలిపించండి - సినీ హీరో దగ్గుబాటి వెంకటేష్

IMG-20240507-WA1343 *- కమాన్  ఖమ్మం అంటూ వెంకీమామ సందడి...*

*- ర్యాలీలో పాల్గొన్న మంత్రి పొంగులేటి, ఎంపీ రేణుకా చౌదరి*

*ఖమ్మం : అమ్మా.... అక్క... బాబూ.. తాతా... చెల్లి.... తమ్ముడూ ఈవీఎంలో మూడో నెంబర్ "గుర్తుం"దా...! అదేనండి మన హస్తం గుర్తు. మే 13వ తేదీ జరిగే ఎన్నికల్లో మన ఆర్ఆర్ఆర్ కి ఓటు వేసి గెలిపించండి అంటూ సినీ హీరో దగ్గుబాటి వెంకటేష్ పేర్కొన్నారు. ఖమ్మంలోని మయూరి సెంటర్ నుంచి పాత బస్టాండ్, జెడ్పీసెంటర్, పాత కలెక్టరేట్ మీదుగా ఇల్లందు క్రాస్ రోడ్ వరకు రామసహాయం రఘురాం రెడ్డి విజయాన్ని కాంక్షిస్తూ రోడ్ షో నిర్వహించారు. మంత్రి పొంగులేటి, ఎంపీ రేణుకా చౌదరి, అభ్యర్థి ఆర్ఆర్ఆర్ పాల్గొన్న ఈ రోడ్ షోలో  వెంకటేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే...! అక్కడ భద్రాచలంలో శ్రీ రాముడు... ఇక్కడ ఖమ్మంలో రఘురాముడు... అలాంటి రఘురాముడికి ఓటువేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలి. అందరికీ "గుర్తుం"ది...! కదా...మే 13..! ఆ రోజు ఈవీఎంలో మూడో నెంబర్ హస్తం గుర్తుకు వేయండి. ఓటు వేయడం మన బాధ్యత... మన హక్కు.... అంటూ తన ప్రసంగాన్ని ముగించారు.*

*- ఎనీ టైం... ఎనీ సెంటర్ అంటూ వెంకీ మామ సందడి*

Read More ఆపదలో ఆపన్నహస్తం....!!

*ఎనీ టైం ... ఎనీ సెంటర్... సింగిల్ హ్యాండ్ రఘురాముడు... ఖమ్మం... ఖమ్మం... ఖమ్మం.... కమాన్ అంటూ సినీ హీరో వెంకీ మామ నగరంలో సందడి చేశారు. మయూరి సెంటర్ నుంచి ఇల్లందు క్రాస్ రోడ్ వరకు జరిగిన రోడ్ షో లో  ఖమ్మం ప్రజానీకం వెంకటేష్ ను చూసేందుకు ఉత్సాహకత చూపారు. సుమారు రెండు గంటల పాటు జరిగిన రోడ్ షో ఆద్యంతం ఖమ్మం ప్రజానీకాన్ని అలరించింది. అడుగడుగునా వెంకటేష్ కు నీరా'జనం' పలికారు. అభివాదం చేస్తూ... హస్తం గుర్తుకు ఓటు వేసి ఆర్ఆర్ఆర్ ను గెలిపించాలని కోరుతూ ముందుకు సాగారు.*

Views: 179
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News

హెల్మెట్ పెట్టుకొని వాహనం నడుపుతానని ప్రతిజ్ఞ చేస్తున్న హెల్మెట్ పెట్టుకొని వాహనం నడుపుతానని ప్రతిజ్ఞ చేస్తున్న
డోర్నకల్ ఏప్రిల్ 14 న్యూస్: డోర్నకల్ మండలం వెన్నారం గ్రామంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్135 జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు.గ్రామ సర్పంచ్ జక్కుల కౌసల్య అంబేద్కర్ విగ్రహానికి...
ఇంటర్ ఫలితాలలో వెలాసిటీ కళాశాల విజయకేతనం
ఖమ్మంలో వెలాసిటీ కళాశాలలో ఎదురులేని ఫలితాలు
మహిళ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఘనంగా కళాశాల వార్షికోత్సవ వేడుకలు
ఆపదలో ఆపన్నహస్తం....!!
యువ నాయకత్వానికి ప్రతీక బంటి అన్న..
ఘనంగా బాబు జగ్జీవన్ రామ్ 119వ జయంతి ఉత్సవాలు..