యునైటెడ్ ఫ్రెండ్స్ ఫౌండేషన్ సేవలు అభినందనీయం..

On
యునైటెడ్ ఫ్రెండ్స్ ఫౌండేషన్ సేవలు అభినందనీయం..

ఇబ్రహీంపట్నం, జూన్ 20 (న్యూస్ ఇండియా ప్రతినిధి): యునైటెడ్ ఫ్రెండ్స్ ఫౌండేషన్ సేవలు అభినందనీయం..ఇబ్రహీంపట్నం నియోజకవర్గం మంచాల మండలం జపాల్ గ్రామం లో యునైటెడ్ ఫ్రెండ్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు నోట్ బుక్స్  పంపిణి చేసారు. ఈ సందర్బంగా ఫౌండేషన్ సభ్యులు మాట్లాడుతూ…విద్య ప్రతి వ్యక్తి జీవితంలో ఎంతో కీలకమైనదని ఎందుకంటే ఇది వారి జీవితాలను మార్చగల శక్తివంతమైన ఆయుదం అని ఇది వ్యక్తిగత ఎదుగుదలకు, సమాజం అభివృద్ధికి మార్గదర్శకంగా ఉంటుందన్నారు. విద్యతోనే మనం సమాజంలో మంచి మార్పును తెచ్చుకోగలమని. విద్యార్థులకు నాణ్యమైన విద్యావకాశాలు కల్పిస్తే అది మన దేశ భవిష్యత్తుని నిర్దేశిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు కృష్ణ,రాము, సుమంత్ రెడ్డి, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

Views: 12

About The Author

Post Comment

Comment List

Latest News

ప్రభుత్వాన్ని కూల్చేద్దాం | Tamil Politics Biggest Twist..! | GeethaMedia Telugu ప్రభుత్వాన్ని కూల్చేద్దాం | Tamil Politics Biggest Twist..! | GeethaMedia Telugu
తమిళ రాజకీయాల్లో భారీ ట్విస్ట్..! దళపతి విజయ్ సీఎం అయిన తర్వాత ఇప్పుడు సూపర్ స్టార్ రజినీకాంత్ వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారాయి. స్టాలిన్‌ను కలవడం...
వెలికట్టలో ఘోర రోడ్డు ప్రమాదం
ఉప సర్పంచుల చెక్ పవర్ తొలగిస్తే  ఉద్యమమే
ధాన్యం కొనుగోళ్లలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలి
పాత లింగాయిపల్లి లో ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు
మైనింగ్ మాయాజాలం..
ఘనంగా హనుమాన్ జయంతి ఉత్సవం