మాదకద్రవ్యాల నిర్మూలన కోసం విద్యార్థులతో ర్యాలీ

కొత్తగూడెం పట్టణంలో త్రీ టౌన్ సీఐ శివప్రసాద్ ఆధ్వర్యంలో కార్యక్రమం

On
మాదకద్రవ్యాల నిర్మూలన కోసం విద్యార్థులతో ర్యాలీ

మత్తు పదార్థాల వల్ల జీవితం అంధకారం అవుతుంది

 

 

కొత్తగూడెం (న్యూస్ ఇండియా నరేష్ ) జూలై 18: మాదకద్రవ్యాల అలవాటుతో భవిష్యత్‌ నాశనమ వుతుందని, మాదకద్రవ్యాల నివారణకు సమష్టిగా కృషి చేయాలని 3టౌన్ సీఐ శివప్రసాద్ అన్నారు. జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్, డిఎస్పీ ఆదేశాల మేరకు రామచంద్ర హైస్కూల్ విద్యార్థులతో గురువారం అవగాహనా ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐ IMG-20240718-WA0833మాట్లాడుతూ మాదకద్రవ్యాల వినియోగంతో పిల్లల భవిష్యత్‌ అంధకారంగా మారుతుందని, వాటికి దూరంగా ఉండాలని, మాదకద్రవ్యాల వినియోగం వల్ల యువత భవిష్యత్‌ నాశనమవుతుందని, తల్లిదండ్రులు తమ పిల్లలను ఎంతో గొప్పవాళ్ళను చేయాలనే ఆశతో ఉంటే కొంత మంది యువత డ్రగ్స్‌కు అలవాటుపడుతున్నారన్నారు. ప్రతి ఒక్కరు మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా పోరాటం చేయాలన్నారు. మత్తు పదార్దాల వల్ల జరిగే అనర్దాలను విద్యార్థులు తమ తల్లితండ్రులకు వివరించాలని, మత్తు పదార్దాలకు సంబందించిన సమాచారం తెలిస్తే సమీపంలో పోలీస్‌ వారికి తెలియజేయాలని సూచించారు.

Views: 34
Tags:

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Related Posts

Post Comment

Comment List

Latest News

మంగళ్పల్లిలో ఆక్రమణల తొలగింపు.. మంగళ్పల్లిలో ఆక్రమణల తొలగింపు..
మంగళ్పల్లిలో ఆక్రమణల తొలగింపు.. రోడ్డు ఆక్రమణలను తొలగిస్తున్న జిహెచ్ఎంసి టౌన్ ప్లానింగ్ అధికారులు ఆదిభట్ల, ఆగస్టు 19 న్యూస్ ఇండియా ప్రతినిధి: మంగళ్పల్లిలో ప్రధాన రహదారిపై ఆక్రమణలపై...
గుడుంబా నిర్మూలనకు పోలీసుల కఠిన చర్యలు
తొర్రూరులో ఎంజీ1 ఈవీ స్కూటర్ల గ్రాండ్‌ లాంచింగ్‌...
గుడుంబా స్థావరాలపై పోలీసుల ఉక్కుపాదం
ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ మృతి ఘటనకు కారణమైన నిందితుల అరెస్ట్
న్యాయవాదిపై దాడిని నిరసిస్తూ తొర్రూరు బార్ అసోసియేషన్ విధుల బహిష్కరణ
తొర్రూరులో గుడుంబాపై పోలీసుల దాడులు