మహిళా చట్టాలపై వెల్లివిరిసిన న్యాయ చైతన్యం
వేరు వేరు కార్యక్రమాల్లో పాల్గొన్న జడ్జీలు - సీనియర్ సివిల్ జడ్జి, సురేష్ - ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి మౌనిక - అదనపు జూనియర్ సివిల్ జడ్జి, తిరుపతి - పర్యవేక్షించిన ప్రిన్సిపల్ జిల్లా జడ్జి శ్రీ పసుపులేటి చంద్రశేఖర ప్రసాద్.
శనివారం మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని వివిధ ప్రాంతాల్లో జరిగిన న్యాయచైతన్య సదస్సులలో జడ్జీలు పాల్గొని మహిళా చట్టాలపై చైతన్యం కలిగించడం జరిగింది.
ఈ కార్యక్రమాల్లో భాగంగా మొదటగా సీనియర్ సివిల్ జడ్జి మరియు సెక్రటరీ జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ, మహబూబాబాద్ వారు జైల్లో ఖైదీలతో న్యాయ చైతన్య సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో 85 మంది ఖైదీలు పాల్గొనడం జరిగింది.
ఇదే రోజు జైల్లో ఖైదీలతో జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ అయిన మౌనిక జైల్ అదాలత్ నిర్వహించడం జరిగింది. ఈ జైల్ అదాలత్ లో 3 కేసులను సెట్ అప్ చేయడం జరిగింది.
ఈ రోజే ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి, శ్రీమతి పి మౌనికచే మహబూబాబాద్ జిల్లా కేంద్రం పరిధిలోని వెంకటేశ్వర స్వామి టెంపుల్ దగ్గర గల ప్రభుత్వ బాలికల ఫార్మసీ కళాశాలలో విద్యార్థినిలకు మహిళా చట్టాలపై న్యాయ చైతన్యం కలిగించడం జరిగింది. ఈ కార్యక్రమంలో బాలికలకు POCSO చట్టం, బాల కార్మిక చట్టం, బాల్యవివాహాలు, మహిళల అక్రమ రవాణా మొదలైన ఆకృత్యాల గురించి సవివరంగా విద్యార్థినిలకు వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో దాసరి నాగేశ్వర్రావు,కళాశాల ప్రిన్సిపల్ స్వప్నారెడ్డి పాల్గొన్నారు.
జిల్లా పరిషత్తు హైస్కూల్, తాళ్లపూసపల్లిలో జరిగిన మరొక న్యాయచైతన్య సదస్సులోఅదనపు అడిషనల్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ అయిన తిరుపతి పాల్గొని మహిళా చట్టాలపై అవగాహన కలిగించారు. ఈ కార్యక్రమంలో కేసముద్రం పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్,మురళీధర్ రాజ్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు కోట కనకయ్య పాల్గొని కార్యక్రమాన్ని విజవంతం చేయడం జరిగింది.
ఈ కార్యక్రమాలన్నింటిని గౌరవ ప్రిన్సిపల్ జిల్లా జడ్జి అయిన శ్రీ పసుపులేటి చంద్రశేఖర ప్రసాద్ పర్యవేక్షించారు.
Comment List