బుద్ధ వెంకన్న ఆవేదనలో అర్థం ఉంది
టిడిపి పార్టీ కచ్చితంగా న్యాయం చేయాల్సిందే
రాజకీయ విశ్లేషకులు ఆడారి నాగరాజు
తెలుగుదేశం పార్టీలో ఫైర్ బ్రాండ్ గా పేరుపొందిన బుద్ధ వెంకన్న తెలుగుదేశం పార్టీని గానీ చంద్రబాబు నాయుడుని గాని ఎవరైనా విమర్శిస్తే ఒంటి కాలు మీద నిలబడే ఏకైక వ్యక్తి బుద్ధ వెంకన్న 2019 ఎన్నికల్లో టిడిపి ఓటమి పాలు అయింది టిడిపిలో ఉన్న అనేకమంది వైసిపి ప్రభుత్వం పై పోరాటం చేయడానికి ముందుకు రాలేకపోయారు అలాంటి సమయంలో కూడా బుద్ధ వెంకన్న పార్టీ కోసం అనేక పోరాటాలు చేశారు 2024 ఎన్నికల్లో బుద్ధ వెంకన్న కి విజయవాడ వెస్ట్ టిడిపి నుండి ఎమ్మెల్యే టికెట్ ఇస్తారని అందరూ ఆశించారు కానీ ఇవ్వలేదు దానికి అనేక కారణాలు ఉండొచ్చు కానీ పార్టీ కోసం ఇంతలా పోరాటాలు చేసిన బుద్ధ వెంకన్న గారికి పార్టీలో తగు స్థానం కల్పించకపోవడం ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఈ పదవి ఇవ్వకపోవడం కిందనున్న క్యాడర్ మాత్రం చాలా ఆవేదన చెందుతున్నారని చెప్పుకోవచ్చు ఏది ఏమైనా పార్టీ అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న పార్టీ కోసం పనిచేసే వ్యక్తులకు న్యాయం చేయాల్సిన బాధ్యత టిడిపి అధిష్టానం పై ఉంది.
Comment List