అటహాసంగా ప్రారంభమైన నేషనల్ స్పోర్ట్స్ డే

ప్రారంభించిన జిల్లా కలెక్టర్ జితిష్ వి పాటిల్

On
అటహాసంగా ప్రారంభమైన నేషనల్ స్పోర్ట్స్  డే

మేజర్ ధ్యాన్ చంద్ పుట్టినరోజున పురస్కరించుకొని కార్యక్రమం

IMG20240828101512కొత్తగూడెం (న్యూస్ ఇండియా) ఆగస్టు 28: నేషనల్ స్పోర్ట్స్ డే సందర్భంగా కొత్తగూడెం ప్రకాశం స్టేడియంలో ప్రభుత్వ ఉద్యోగులకు క్రీడలను జిల్లా కలెక్టర్ జితిష్ వి పాటిల్ జిల్లా యువజన మరియు క్రీడల శాఖ ఆధ్వర్యంలో బుధవారం అటహాసంగా ప్రారంభించారు. ముఖ్య అతిథిగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేశారు.ఈ కార్యక్రమానికి జిల్లా యువజన క్రీడల అధికారి పరంధామరెడ్డి అధ్యక్షతన వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రముఖ హకి క్రీడాకారుడు , మేజర్ ధ్యాన్ చంద్ పుట్టినరోజును పురస్కరించుకొని ప్రతి ఏటా జాతీయ క్రీడ దినోత్సవంగా జరుపుకుంటున్నట్లుగా తెలిపారు. ప్రతి ఒకరు కూడా క్రీడ స్ఫూర్తిని పెంపొందించుకోవాలని అన్నారు.ఈ క్రీడలలో త్రో బాల్ , చెస్, వాలీ బాల్, 100 మీటర్స్ వాక్ పరుగు పందెం ,క్రికెట్ , బ్యాట్మెంటన్ , టేబుల్ టెన్నిస్, మ్యూజికల్ చైర్, లెమన్ అండ్ స్పూన్ , టగ్ ఆఫ్ వార్ క్రీడలను నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి జిల్లా క్రీడాకారులు ప్రభుత్వ (ఉద్యోగులు) క్రీడా సంఘాల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

 

Views: 107
Tags:

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Related Posts

Post Comment

Comment List

Latest News

తొర్రూరులో ఎంజీ1 ఈవీ స్కూటర్ల గ్రాండ్‌ లాంచింగ్‌... తొర్రూరులో ఎంజీ1 ఈవీ స్కూటర్ల గ్రాండ్‌ లాంచింగ్‌...
ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి ముఖ్యఅతిథిగా, భూమి చైర్మన్‌ ఎండీ రకమ్‌ సింగ్‌ రాణా, సినీ నటుడు హరీష్‌కుమార్‌ ప్రత్యేక అతిథులుగా, ఎంజీవన్‌ భూమి చైర్మన్‌, ఎండీ కొత్త...
గుడుంబా స్థావరాలపై పోలీసుల ఉక్కుపాదం
ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ మృతి ఘటనకు కారణమైన నిందితుల అరెస్ట్
న్యాయవాదిపై దాడిని నిరసిస్తూ తొర్రూరు బార్ అసోసియేషన్ విధుల బహిష్కరణ
తొర్రూరులో గుడుంబాపై పోలీసుల దాడులు
అంబర్‌పేట్‌లో 20 క్వింటాళ్ల  పీడీఎస్ బియ్యం స్వాధీనం..
మాకు ఈ టీచర్ వద్దు.. మా పిల్లల భవిష్యత్తును కాపాడండి