పెద్దకడుబూరులోని శ్రీశ్రీ పెద్ద లక్ష్మమ్మ మరియు చిన్న లక్ష్మమ్మ దేవతలకు ప్రత్యేక పూజలు..!

దేవతలకు ప్రత్యేక పూజలు చేసిన మొట్రో అంజినయ్య, రామాంజినమ్మ దంపతులు.

On
పెద్దకడుబూరులోని శ్రీశ్రీ పెద్ద లక్ష్మమ్మ మరియు చిన్న లక్ష్మమ్మ దేవతలకు ప్రత్యేక పూజలు..!

ఆలయ పూజారులు విశ్వబ్రాహ్మణ నరసింహాచారి మరియు విశ్వబ్రాహ్మణ ఈరన్నచారులు.

న్యూస్ ఇండియా/పెద్దకడుబూరు మండలం నవంబర్ 12 :- మంత్రాలయం నియోజకవర్గం మండల కేంద్రమైన పెద్దకడుబూరులో మంగళవారం శ్రీశ్రీ పెద్ద లక్ష్మమ్మ దేవి చిన్న లక్ష్మమ్మ దేవికి ప్రత్యేక పూజలు చేపట్టారు. కార్తీక మాసం శుక్లపక్షం మంగళవారము ఏకాదశి రోజున పెద్దకడుబూరు గ్రామంలో వెలసిన దేవతలైన శ్రీశ్రీ పెద్ద లక్ష్మమ్మ దేవి మరియు చిన్న లక్ష్మమ్మ దేవి అమ్మవారులకు మొట్రో అంజినయ్య, రామాంజినమ్మ దంపతులు అమ్మవారులకు పట్టు వస్త్రములు ఒడిబియ్యము సమర్పించి ప్రత్యేక పూజలు చేసారు. ఈ కార్యక్రమంలో పూజారులు విశ్వబ్రాహ్మణ నరసింహాచారి మరియు విశ్వబ్రాహ్మణ ఈరన్నచారులు మంగళవారం తెల్లవారు జామున అమ్మవారులకు జలాభిషేకము, వస్త్రాభరణం కుంకుమార్చన, ఆకుపూజ మరియు దీప దూప నైవేద్యము సమర్పించి అమ్మవారులను ప్రత్యేకంగా అలంకరించి పూజించడం జరిగింది. పూజ కార్యమానికి వచ్చిన భక్తాదులకు తీర్థ ప్రసాదములు సమర్పించి, వాల్మీకి మోట్రో ఆంజనేయులు, రామాంజినమ్మ దంపతులు మరియు గ్రామ ప్రజలు ఈ పూజ కార్యక్రమంలో పాల్గొని దేవతలను నమస్కరించుకొని వారి మొక్కులు తీర్చుకున్నారు...IMG-20241112-WA0105

Views: 29
Tags:

About The Author

Post Comment

Comment List

Latest News