జాతీయ సేవా పథక అవశ్యకత పై అవగాహన కార్యక్రమం... 

ముఖ్య అతిథిగా ఎన్ఎస్ఎస్ ఉస్మానియా విశ్వవిద్యాలయ కోఆర్డినేటర్  ప్రొఫెసర్  విద్యాసాగర్

On
జాతీయ సేవా పథక అవశ్యకత పై అవగాహన కార్యక్రమం... 

జాతీయ సేవా పథక అవశ్యకత పై అవగాహన కార్యక్రమం... 

రంగారెడ్డి జిల్లా, మహేశ్వరం, సెప్టెంబర్ 08, న్యూస్ ఇండియా ప్రతినిధి: ప్రభుత్వ డిగ్రీ కళాశాల మహేశ్వరంలో సోమవారం డిగ్రీ మొదటి సంవత్సరం విద్యార్థినీ, విద్యార్థులకు జాతీయ సేవా పథక అవశ్యకతపై  అవగాహన (ఒరియెంటేషన్) కార్యక్రమం ప్రిన్సిపల్ డాక్టర్ సంగి రమేశ్ అధ్యక్షతన జరుపుకోవడం జరిగింది. ఈ  కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎన్ఎస్ఎస్ ఉస్మానియా విశ్వవిద్యాలయ కోఆర్డినేటర్  ప్రొఫెసర్  విద్యాసాగర్

IMG-20250908-WA1007
పాటలతో అలరించిన విద్యార్థిని..

హాజరయ్యారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథి ప్రొఫెసర్  విద్యాసాగర్ మాట్లాడుతూ... స్వచ్ఛంద సమాజ సేవ ద్వారా యువతలో సామాజిక స్పృహ, వ్యక్తిత్వ వికాసం మరియు నాయకత్వ నైపుణ్యాలను పెంపొందించడానికి జాతీయ సేవా పథకం (ఎన్ఎస్ఎస్) ముఖ్యమైనదనీ, ఇది విద్యావంతులైన యువత మరియు సమాజాల మధ్య అంతరాన్ని తగ్గించడంలో సహాయపడుతుందని  అన్నారు. ప్రిన్సిపల్ డాక్టర్ సంగి రమేశ్ మాట్లాడుతూ.. ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు జీవన ప్రమాణాలను పెంపొందించడానికి, అణగారిన వర్గాలకు గౌరవాన్ని అందించడానికి కృషి చేస్తారనీ, స్వచ్ఛంద సేవకులు సమాజ అవసరాలు, సమస్యలను గుర్తించడంలో చురుకుగా పాల్గొంటారనీ, ఆపై ఆచరణాత్మక పరిష్కారాలను కనుగొనడానికి సమాజంతో కలిసి పని చేస్తారన్నారు. అలాగే ప్రకృతి, మానవ నిర్మిత విపత్తుల సమయంలో ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు ఆహారం, దుస్తులు, ప్రథమ చికిత్సతో సహా కీలకమైన సహాయాన్ని అందిస్తారనీ నిజ జీవిత సమస్యలను బహిర్గతం చేసి సామాజిక, పౌర బాధ్యత యొక్క భావాన్ని కలిగిస్తుందన్నారు. అలాగే ఆరోగ్యం, విద్య మరియు పర్యావరణ పరిరక్షణ వంటి అంశాలను పరిష్కరించడం ద్వారా, ఎన్ఎస్ఎస్ సమగ్ర అభివృద్ధిని ప్రోత్సహిస్తుందని, జాతి నిర్మాణానికి దోహదపడుతుందని" అన్నారు. ఈ సందర్భంగా  ఎన్ఎస్ఎస్ విభాగ అధికారిణి డాక్టర్ జాహెదబేగం ఆధ్వర్యంలో వాలంటీర్లు పలు సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఉత్తమ వాలంటీర్లకు ముఖ్య అతిథి చేతుల మీదుగా బహుమతులను  ప్రధానంచేశారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ &ఐక్యుఎసి కోఆర్డినేటర్ డాక్టర్ ఇంతియాజుద్దీన్ ఫారూఖీ,ఏ సిఓ శ్రీదేవి, నరేందర్ రెడ్డి,డాక్టర్ శ్రీహరి రెడ్డి,డాక్టర్ ఉపేంద్ర డాక్టర్ గోపాల్, డాక్టర్ చెన్నోజి, సునీత, రవళిక,  కుమార్, సుమతి, సురేశ్ విద్యార్థినీ, విద్యార్ధులు పాల్గొన్నారు.

Views: 22

About The Author

Post Comment

Comment List

Latest News

నకిరేకల్ బస్టాండ్ లో దొంగలు హల్చల్...? నకిరేకల్ బస్టాండ్ లో దొంగలు హల్చల్...?
న్యూస్ ఇండియా తెలుగు, (సెప్టెంబర్ 12) నల్లగొండ జిల్లా ప్రతినిధి :నకిరేకల్ పట్టణం లో స్థానికంగా ఉన్న బస్టాండ్లో హైదరాబాదుకు వెళ్లడానికి సిద్ధంగా ఉన్న వ్యక్తి నుండి...
తెలంగాణ భూముల పరిరక్షణ సమితి నల్లగొండ జిల్లా అధ్యక్షులుగా కాశిమల్ల విజయ్ కుమార్ నియామకం..
శబ్బాష్.. మున్సిపాలిటీ
జనగామ జిల్లా పాలకుర్తి మండలం కేంద్రంలోని కార్మెల్ కాన్వెంట్ హైస్కూల్లో ఘనంగా టీచర్స్ డే వేడుకలు
టిజేఎంయు కొత్తగూడెం అధ్యక్షులుగా రాము నాయక్
జాతీయ సేవా పథక అవశ్యకత పై అవగాహన కార్యక్రమం... 
సంగారెడ్డి అర్డిఓ కార్యాలయానికి పట్టిన ‘గ్రహణం వీడింది’