టెక్నికల్ సిబ్బందికి వివిధ వర్టికల్ విభాలపై నైపుణ్యత గురించి ఒక్కరోజు శిక్షణ తరగతులు.
ఈ ట్రైనింగ్ ను సద్వినియోగం చేసుకొని, మంచి ఫలితాలు రాబట్టాలి.. జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ ఐపిఎస్.
సంగారెడ్డి జిల్లా, బ్యూరో చీఫ్, మే 15, న్యూస్ ఇండియా : నాణ్యమైన ఇన్వెస్టిగేషన్ చేసేందుకు అనుకూలంగా తెలంగాణ రాష్ట్ర పోలీసు శాఖ వివిధ రకాల ఆధునిక విజ్ఞాన సాంకేతికత ను అందుబాటులో తెచ్చిందని జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ తెలియచేసారు. తేది: 15.05.2025 నాడు జిల్లా పోలీసు కార్యాలయంలో వివిధ పోలీసు స్టేషన్స్, సర్కిల్, డియస్పీ కార్యాలయాలలో విధులు నిర్వహిస్తున్న టెక్నికల్ సిబ్బందికి ఒక్కరోజు శిక్షణ తరగతులను నిర్వహించారని జిల్లా ఎస్ప తెలియజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. మారుతున్న సమాజానికి అనుగుణంగా కంప్యూటర్ పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని, వివిధ వర్టికల్ విభాగాలలో మంచి ప్రతిభ కనబరచాలని, ఎఫ్ఐఆర్ మొదలుకొని డాటా ఎంట్రీ, ఈ-పెట్టి కేసులు, ఈ చల్లాన్ నమోదు వరకు ఎలాంటి సందేహాలున్న ఈ శిక్షణ ద్వారా నివృత్తి చేసుకోవాలని, శిక్షణ అనంతరం కుండా జిల్లా ఐటి సెల్ సేవలను వినియోగించుకొని, వర్తికల్ విభాగంలో సంగారెడ్డి జిల్లాను ముందు వరుసలో నిలపడానికి కృషి చేయాలని ఎస్పీ సూచించారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మెరుగైన సేవలను, నాణ్యమైన ఇన్వెస్టిగేషన్ చేసేందుకు అనుకూలంగా తెలంగాణ రాష్ట్ర పోలీసు శాఖ వివిధ రకాల ఆధునిక యాప్ లను అందుబాటులోకి తీసుకురావడం జరిగిందని, ఈ ఆధునిక యాప్ లను సక్రమంగా వినియోగిస్తూ, పనిని సులభతరం చేసుకోవచ్చని అన్నారు. ఈ శిక్షణ ద్వారా మీ ()యొక్క నైపుణ్యత పెరుగడంతో పాటు, వివిధ స్టేషన్లలో అన్నిరకాల సేవలను చేసేందుకు పూర్తి స్థాయిలో సిద్దంగా ఉంటారని అన్నారు. ఈ శిక్షణను సద్వినియోగం చేసుకొని జిల్లాకు మరిన్ని మెరుగైన సేవలను అందించాలని ఎస్పీ గారు సూచించారు. ఈ ఒక్కరోజు శిక్షణ కార్యక్రమానికి ఫంక్షనల్ వర్టికల్ మానిటరింగ్ అధికారి / డియస్పీ జహీరాబాద్ రామ్ మోహన్ రెడ్డి, వర్టికల్ కో-ఆర్డినేటర్ / ఇన్స్పెక్టర్ డీసీఆర్బీ రమేష్, ఐ.టి సెల్ ఇన్స్పెక్టర్ కిరణ్ కుమార్, ఐ.టి సెల్ సిబ్బంది సజీవ్, చంద్రశేఖర్, రవి, శ్రీకాంత్ వివిధ స్టేషన్ లకు చెందిన టెక్నికల్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
Comment List