అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యతిరేక దినం..
డాక్టర్ చింతల రాకేశ్ భవాని ఎస్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారి ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఇబ్రహీంపట్నం
అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యతిరేక దినం..
డాక్టర్ చింతల రాకేశ్ భవాని ఎస్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారి ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఇబ్రహీంపట్నం..
.jpg)
"మాదక ద్రవ్యాలు" అనగా మానవ శరీరానికి మిక్కిలి హాని కలిగిపు కొన్ని పదార్ధాలు. వీటిని ప్రపంచమంతా "డ్రగ్స్" అని వ్యవహరిస్తారు. మాదక ద్రవ్యాల వాడకం ఒక ప్రమాదమైన వ్యసనము - ఈనాటి యువతరాన్ని దారి మళ్ళించి చెడు మార్గాల్లో నడిపిస్తున్న దురలవాట్లలో మాదక ద్రవ్యాల వినియోగం తీవ్రమైనది. తెలుగులో "డ్రగ్స్" అంటే "మాదక ద్రవ్యాలు" లేదా "మత్తు పదార్థాలు" అని అర్థం. ఇవి మానవ శరీరానికి హాని కలిగించే పదార్థాలు, వీటిని ఉపయోగించడం వ్యసనంగా మారుతుంది. ప్రపంచ మానవాళిని మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా చైతన్యవంతం చేయడానికి ప్రతి ఏటా జూన్ 26వ తేదీని అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యతిరేక దినంగా ప్రకటించింది. మాదక ద్రవ్యాల వ్యతిరేకంగా ప్రపంచమంతటా కార్యక్రమాలు జరుపుకోడానికి గాను జూన్ 26వ తేదీని ఐరాస సర్వ ప్రతినిధి సభ 1987లో మొట్టమొదటిసారిగా తీర్మానించింది. గడచిన ఐదేళ్లలో భారత్లో మాదక ద్రవ్యాల వినియోగం అమితంగా పెరిగిపోయింది. సంపన్న వర్గాల్లో తేరగా వచ్చే ఆదాయం పెరిగిపోవడం దీనికి ఒక ముఖ్య కారణం. మాదక ద్రవ్యాల ముఠాలు 1980లలో విద్యార్థులను తమ ప్రధాన లక్ష్యాలుగా చేసుకునేవి. ఇప్పుడవి ఎగువ మధ్యతరగతి ప్రజలందర్నీ లక్ష్యంగా చేసుకున్నాయి. రసాయనిక పరమైన మందులతో భారతదేశానికి వచ్చి గంజాయి లాంటి వాటిని తిరిగి తీసుకువెళ్లే విదేశీ పర్యాటకుల నుంచి వీటికి ఎక్కువ గిరాకీ లభిస్తోంది. ప్రధానంగా కొకైన్ దక్షిణ అమెరికా నుంచి భారత్ క్కు వివిధ మార్గాల ద్వారా తరలివస్తోంది. కొన్ని రకాల మాదక ద్రవ్యాలు న్యూరోసైకియాట్రిక్ వ్యాధులు, కార్డియో వాస్కులర్ వ్యాధులకు కారణం అవుతాయి. ప్రమాదాలు, ఆత్మహత్యలు, దౌర్జన్యకాండ వంటి సంఘటనలు కూడా చోటు చేసుకుంటాయి. అందుకే మాదక ద్రవ్యాల వినియోగాన్ని సైకోసోషల్ మెడికల్ సమస్యగా పరిగణనలోకి తీసుకోవాలి. ఈ కొత్త ధోరణికి మహిళలు పెద్ద సంఖ్యలో ఖాతాదారులు కావడం ఆసక్తిగొలిపే పరిణామం. చిత్ర పరిశ్రమలో కొందరు కోకు అలవాటు పడిపోతున్నారు. దానిని ఒకసారి వాసన చూస్తే ఆకలి నశిస్తుంది. చాలా గంటల పాటు శక్తివంతంగా వుండేటట్లుగా చేస్తుంది. అందుకే అది సన్నబడేందుకు సరికొత్త సాధనంగా అవతరిస్తోంది. ఆహారం ప్రమేయమే లేకుండా, లేదంటే ఆహార ప్రమేయాన్ని బాగా తగ్గించి, పార్టీలను ఎనర్జీ డ్రింకులకు, మాదక ద్రవ్యాలకు పరిమితం చేయడానికి కారణం ఇందులో వెల్లడవుతుంది. మహిళలు అనేక సమస్యల నుంచి తప్పించుకోవడానికి కూడా ఒక మార్గంగా మాదక ద్రవ్యాలను ఆశ్రయిస్తున్నారు. అన్నింటినీ మించి మాదకద్రవ్యాల మీద ఆధారపడటం వల్ల జీవ రసాయనికంగా, మానసికంగా, సామాజికంగా దెబ్బతినడం, మందులలోని రసాయనిక పదార్దాలు నాడీ వ్యవస్థ మీద దాడి చేయడం, తీవ్రమైన ప్రవర్తనలు, కాలక్రమంలో ఆత్మీయులతో సంబంధాలు విచ్ఛిన్నం కావడం జరుగుతాయి. భారతదేశంలో కొకైన్పై వ్యసనపడుతున్న వారి సంఖ్య రానురానూ పెరుగుతోందని అధికారులు నిర్ధారిస్తున్నారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినం సందర్భంగా మాదకద్రవ్యాల బారినపడబోమని, మానవ ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఈ మహమ్మారికి వ్యతిరేకంగా ప్రచారం చేస్తామని ప్రతిన చేద్దాం.
Comment List