వెల్లివిరిసిన మత సామరస్యం
హంసాత్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గణేష్ నిమజ్జన
భక్తులకు వాటర్ బాటిల్స్ పంపిణీ
హిందూ ముస్లిం ఐక్యతకు నిదర్శనం ఈ కార్యక్రమం-ఏసీపీ దేవేందర్ రెడ్డి
న్యూస్ ఇండియా తెలుగు ( తెలంగాణ బ్యూరో రిపోర్టర్ వెంకన్న గౌడ్ )
జనగామ:
జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ చౌరస్తాలో హంసాత్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గణేష్ నిమజ్జనానికి వచ్చే భక్తులకు వాటర్ బాటిల్ పంపిణీ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఏసీపీ కె.దేవేందర్ రెడ్డి హాజరయ్యారు.అనంతరం ఏసీపీ హంసాత్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు మహమ్మద్ యాకుబ్ పాషా ని అభినందించారు.అనంతరం వారు మాట్లాడుతూ జనగామ ప్రాంతంలో హిందూ ముస్లింలు అన్నదమ్ముల వలే కలిసి ఉంటారని దానికి నిదర్శనమే ఈ యొక్క కార్యక్రమము అని ఇలాగే ఎల్లప్పుడూ అందరూ కలిసిమెలిసి ఉండాలని వారు కోరారు.అనంతరం ఈ కార్యక్రమంకు బిజెపి జిల్లా అధ్యక్షులు ఆరుట్ల దశమంతరెడ్డి,మున్సిపల్ కౌన్సిలర్ బోట్ల శ్రీనివాస్ హాజరై వాటర్ బాటిల్స్ స్వీకరించి అక్కడ ఉన్న ముస్లిం సోదరులను అభినందించడంతో ఈ కార్యక్రమం ఒక ప్రత్యేకతను చాటుకుంది.గణేష్ నిమజ్జనానికి వచ్చే భక్తులకు వాటర్ పంపిణీ చేస్తున్నందుకు
విశ్వ హిందూ పరిషత్ వారు హం సాత్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు మహమ్మద్ యాకుబ్ పాషాను శాలువాతో సత్కరించి వారికి అభినందనలు తెలిపారు.ఈ కార్యక్రమంలో టీఎస్ మీసా జిల్లా అధ్యక్షులు అంకుశావాలి,మదీనా మజీద్ అధ్యక్షులు అబ్దుల్ మతిన్ అథర్,ఎండి జలీల్,ఆర్టిసి కాలనీ ముస్లిం యువజన నాయకులు మహమ్మద్ అక్బర్,అబ్దుల్ రహీం, రియాజ్,మహమ్మద్ ఇస్మాయిల్,మహమ్మద్ సలీం ల్,మహమ్మద్ బాబా,మహమ్మద్ ఆరిఫ్ తదితరులు పాల్గొన్నారు.
Comment List