వెల్లివిరిసిన మత సామరస్యం

హంసాత్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గణేష్ నిమజ్జన

By Venkat
On
వెల్లివిరిసిన మత సామరస్యం

భక్తులకు వాటర్ బాటిల్స్ పంపిణీ

హిందూ ముస్లిం ఐక్యతకు నిదర్శనం ఈ కార్యక్రమం-ఏసీపీ దేవేందర్ రెడ్డి

న్యూస్ ఇండియా తెలుగు ( తెలంగాణ బ్యూరో రిపోర్టర్ వెంకన్న గౌడ్ )

జనగామ:

 జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ చౌరస్తాలో హంసాత్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గణేష్ నిమజ్జనానికి వచ్చే భక్తులకు వాటర్ బాటిల్ పంపిణీ   కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఏసీపీ కె.దేవేందర్ రెడ్డి హాజరయ్యారు.అనంతరం ఏసీపీ హంసాత్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు మహమ్మద్ యాకుబ్ పాషా ని అభినందించారు.అనంతరం వారు మాట్లాడుతూ జనగామ ప్రాంతంలో హిందూ ముస్లింలు అన్నదమ్ముల వలే కలిసి ఉంటారని దానికి నిదర్శనమే ఈ యొక్క కార్యక్రమము అని ఇలాగే ఎల్లప్పుడూ అందరూ కలిసిమెలిసి ఉండాలని వారు కోరారు.అనంతరం ఈ కార్యక్రమంకు బిజెపి జిల్లా అధ్యక్షులు ఆరుట్ల దశమంతరెడ్డి,మున్సిపల్ కౌన్సిలర్ బోట్ల శ్రీనివాస్ హాజరై వాటర్   బాటిల్స్ స్వీకరించి అక్కడ ఉన్న ముస్లిం సోదరులను అభినందించడంతో ఈ కార్యక్రమం ఒక ప్రత్యేకతను చాటుకుంది.గణేష్ నిమజ్జనానికి వచ్చే భక్తులకు వాటర్ పంపిణీ చేస్తున్నందుకు
విశ్వ హిందూ పరిషత్ వారు  హం సాత్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు మహమ్మద్ యాకుబ్ పాషాను శాలువాతో సత్కరించి వారికి అభినందనలు తెలిపారు.ఈ కార్యక్రమంలో టీఎస్ మీసా జిల్లా అధ్యక్షులు అంకుశావాలి,మదీనా మజీద్ అధ్యక్షులు అబ్దుల్ మతిన్ అథర్,ఎండి జలీల్,ఆర్టిసి కాలనీ ముస్లిం యువజన నాయకులు మహమ్మద్ అక్బర్,అబ్దుల్ రహీం, రియాజ్,మహమ్మద్ ఇస్మాయిల్,మహమ్మద్ సలీం ల్,మహమ్మద్ బాబా,మహమ్మద్ ఆరిఫ్ తదితరులు పాల్గొన్నారు.

Read More ఘనంగా ఐరిస్ ఫ్లోరేట్స్ వరల్డ్ స్కూల్ ప్రారంభం..

Views: 12
Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

వైయస్సార్సీపి కర్నూలు జిల్లా యువజన విభాగం సెక్రటరీగా ఆర్. శివరామి రెడ్డి ఎన్నిక... వైయస్సార్సీపి కర్నూలు జిల్లా యువజన విభాగం సెక్రటరీగా ఆర్. శివరామి రెడ్డి ఎన్నిక...
పెద్దకడుబూరు మండలం / న్యూస్ ఇండియా ప్రతినిధి షబ్బీర్ షా జూలై 01 :-  వైయస్ఆర్సిపి రాష్ట్ర అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి...
నమ్మించి ఓట్లు దండుకున్న చంద్రబాబుకు బుద్ధి చెప్పాలి జగన్ సార్..!
పెద్దకడుబూరు మండలం : డ్రైనేజీలు, వీధిలైట్లు మరియు త్రాగునిటీ సమస్యలు పరిష్కరించండి... సిపిఐ
రైతుల సంక్షేమమే మా ప్రభుత్వ ఉద్దేశం..
జిల్లాలో నెల రోజులపాటు 30, 30(ఎ) పోలీసు యాక్ట్ అమలు
జీవితాలను ఛిద్రం చేసిన 'సిగాచి ఫార్మా'
ఘనంగా ఐరిస్ ఫ్లోరేట్స్ వరల్డ్ స్కూల్ ప్రారంభం..