
తాత్కాలిక బాణాసంచా విక్రయాలకు అనుమతి
విక్రయ కేంద్రాల అనుమతికై దరఖాస్తు చేసుకొండి
వరంగల్ పోలీస్ కమిషనర్
న్యూస్ ఇండియా తెలుగు : వరంగల్
తాత్కాలిక బాణాసంచా విక్రయాలకు అనుమతి కోసం ఆసక్తి కల్గిన వ్యక్తులు,సంస్థలు దరఖాస్తు చేసుకోవాలసిందిగా వరంగల్ పోలీస్ కమిషనర్ సోమవారం ప్రకటన విడుదల చేశారు. దరఖాస్తు చేసుకునే వారు దరఖాస్తు ఫారంతో తప్పనిసరిగా అగ్నిమాపక విభాగం అధికారులు జారీచేసిన ఎన్. ఓ. సి తో పాటు, ప్రవైయిటు స్థలాల్లో ఏర్పాటు చేస్తున్నట్లు అయితే స్థల యజమాని అనుమతి పత్రం, అలాగే ప్రభుత్వ స్థలాల్లో అయితే సంబందిత ప్రభుత్వ అధికారుల అనుమతి పత్రం,పక్క నిర్మాణాల్లో ఏర్పాటు చేసుతున్నట్లు అయితే పక్కవారి అనుమతితో పాటు పక్క భవన బ్లూ ప్రింట్ తో పాటు స్టేట్ బ్యాంక్ అఫ్ ఇండియా, ఆదాలట్ శాఖలో ఎనిమిది వందల రూపాయలు ప్రభుత్వ ఖజానాకు జామచేసినట్లుగా బ్యాంక్ చాలన్ తో దరఖాస్తుదారులు దరఖాస్తు చేసుకోవాల్సి వుంటుంది. పూర్తి చేసిన దరఖాస్తులను నవంబర్ 6వ తేదీలోపు సంబంధిత జోన్లకు చెందిన డీసీపీ స్థాయి అధికారులకు దరఖాస్తు చేసుకోవాలని పోలీస్ కమిషనర్ తెలిపారు. వచ్చిన దరఖాస్తులను పరిశీలించిన అనంతరం సంబంధిత అధికారులు బాణాసంచా అనుమతులు జారీ చేస్తారు .
About The Author
Related Posts
Post Comment
Latest News

Comment List