ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దడమే నా లక్ష్యం..
ఉదయపు నడకతో కాంగ్రెస్ పార్టీకి ప్రజాదరణ..
On
ఉదయపు నడకతో కాంగ్రెస్ పార్టీకి ప్రజాదరణ..
ఎల్బీనగర్, నవంబర్ 02 (న్యూస్ ఇండియా తెలుగు): ఉదయపు నడకలో భాగంగా గురువారం మన్సూరాబాద్ డివిజన్లో పెద్ద చెరువు దగ్గర ఎల్బీనగర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మధు యాష్కీ గౌడ్ హాజరయ్యారు. ప్రజల నుండి విశేష స్పందన లభించింది. తమంతట తాముగా వస్తూ ఈసారి గెలిచేది మా మధన్ననే మా ఓట్లు మీకే అంటూ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మధుయాష్కి మాట్లాడుతూ.. రౌడీ గుండాలకు నెలవుగా మారిన ఎల్బీనగర్ నియోజకవర్గాన్ని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దడమే నా లక్ష్యం అన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఇన్చార్జ్ జెక్కిడి ప్రభాకర్ రెడ్డి, కార్పొరేటర్ దరిపల్లి రాజశేఖర్ రెడ్డి, వజీర్ ప్రకాష్ గౌడ్, డివిజన్ ప్రెసిడెంట్ బుద్ధ సత్యనారాయణ, కళ్లెం సుజాత రెడ్డి, స్వర్ణ మాధవి, ముఖ్య నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Views: 67
Comment List