రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రతిపక్షాలకు విలువనిచ్చి ప్రభుత్వం కావాలి

జాకట శ్రీనివాస్ ఆర్.ఎస్.పి పార్టీ రాష్ట్ర అధ్యక్షులు.

By Venkat
On
రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రతిపక్షాలకు విలువనిచ్చి ప్రభుత్వం కావాలి

జాకట శ్రీనివాస్

ఈరోజు ఉదయం మేడ్చల్ లోని రాష్ట్ర సామాన్య ప్రజా పార్టీ ప్రధాన కార్యాలయంలో ఆ పార్టీ వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షులు జాకట శ్రీనివాస్ పత్రికల విలేకరులతో మాట్లాడుతూ ముందుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన గౌరవనీయులు  ముఖ్యమంత్రి ఎనమల రేవంత్ రెడ్డి గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. తెలంగాణ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం, పేద ప్రజల ప్రభుత్వం, సామాన్య ప్రజల ప్రభుత్వం కావాలని రాష్ట్ర సామాన్య ప్రజా పార్టీ తరఫున ఆశిస్తున్నాను. పేద ప్రజలు, సామాన్య ప్రజలు, రెక్క ఆడుతే గాని డొక్కాడని ప్రజలు వారి అవసరాలను అక్కర్లను ప్రతిపక్షాల ద్వారానే అధికార పక్షానికి తెలియజేస్తారని విషయాన్ని దృష్టిలో పెట్టుకొని రేవంత్ రెడ్డి ప్రభుత్వం వ్యవహరిస్తే మన తెలంగాణ సమాజం బాగుపడుతుందని జాకట శ్రీనివాస్ తెలియజేశారు. రాష్ట్ర సామాన్య ప్రజా పార్టీ ద్వారా మేము కూడా సామాన్య ప్రజల పక్షాన ఉంటూ ప్రభుత్వానికి మా దృష్టికి వచ్చిన ప్రతిసమస్యను తీసుకెళ్లి ప్రజలకు అండగా ఉంటామన్నారు.  మరిముఖ్యంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 6 గ్యారంటీలు, మన సామాన్య ప్రజలకు అందేలా ఆర్.ఎస్.పి పార్టీ కార్యచరణ ఉంటుందని జాకట శ్రీనివాస్ తెలియజేశారు. రాష్ట్ర సామాన్య ప్రజా పార్టీ లక్ష్యం సామాన్య ప్రజల సంక్షేమమని మరోసారి జాకట శ్రీనివాస్ గుర్తు చేశారు.IMG_20231208_143343

Views: 122
Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

వైయస్సార్సీపి కర్నూలు జిల్లా యువజన విభాగం సెక్రటరీగా ఆర్. శివరామి రెడ్డి ఎన్నిక... వైయస్సార్సీపి కర్నూలు జిల్లా యువజన విభాగం సెక్రటరీగా ఆర్. శివరామి రెడ్డి ఎన్నిక...
పెద్దకడుబూరు మండలం / న్యూస్ ఇండియా ప్రతినిధి షబ్బీర్ షా జూలై 01 :-  వైయస్ఆర్సిపి రాష్ట్ర అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి...
నమ్మించి ఓట్లు దండుకున్న చంద్రబాబుకు బుద్ధి చెప్పాలి జగన్ సార్..!
పెద్దకడుబూరు మండలం : డ్రైనేజీలు, వీధిలైట్లు మరియు త్రాగునిటీ సమస్యలు పరిష్కరించండి... సిపిఐ
రైతుల సంక్షేమమే మా ప్రభుత్వ ఉద్దేశం..
జిల్లాలో నెల రోజులపాటు 30, 30(ఎ) పోలీసు యాక్ట్ అమలు
జీవితాలను ఛిద్రం చేసిన 'సిగాచి ఫార్మా'
ఘనంగా ఐరిస్ ఫ్లోరేట్స్ వరల్డ్ స్కూల్ ప్రారంభం..