అతడి పాట 'అనంతం'

అతడు పాటల చెలికాడు.

By Venkat
On
అతడి పాట 'అనంతం'

అనంతోజు సోమన్న

పోరుగడ్డ వొడిన 
 కోయిలయి కూసిన కమ్మని పాటగాడు. 
 అతని పాట 'అనంతం', 
 పరవళ్ళు తొక్కిన 
 పాల్కురికి సోమన సాహిత్య ప్రభల్లో 
 పొద్దు తిరుగుడు పువ్వు లాంటివాడు. 
 జానపద మల్లెలలను 
 ఏరి పాటలల్లిన పాలకుర్తి బిడ్డ 
 ఈ అనంతోజు సోమన్న. 

 జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రానికి చెందిన అనంతోజు చంద్రమౌళి కనకలక్ష్మీ దంపతుల ఏకైక కుమారుడు సోమన్న. 1971లో జన్మించాడు. వృత్తిరీత్యా కార్పెంటర్. పదో తరగతి చదివిన  సోమన్నను శ్రీశ్రీ రచనలు ప్రభావితం చేశాయి. మొదటి నుండి సాహిత్య అభిరుచి కలిగినవాడు. 1985 నుంచి విద్యార్థి దశలో జానపద గేయాలు రాసిన వాడు. అప్పుడప్పుడు కాలక్షేపం కోసం పాటలు, మిని కవితలు రాయడం, పాడడం చేసేవాడు. 50కి పైగా పాటలు రాసిన సోమన్న మల్లెల పరిమళం. 

సరైన ప్రోత్సాహం, అవకాశాలు రాకపోవడంతో ప్రాచర్యంలోకి రాలేదు. తన మిత్రులకి, కొద్దిమంది సాహిత్య మిత్రులకి మాత్రమే రచయితగా, సింగర్ గా పరిచయం. పలు సందర్భాల్లోనూ సాహిత్య సభలలో తాను రాసిన పాటలు పాడి సబికుల్ని ఆశ్చర్యపరిచాడు. స్థానికంగా శ్రీ సోమనాధ కళాపీఠం, పట్టభద్ర రచయితల సంఘం సాహిత్య సంస్థలతో ఆయనకు అనుబంధం ఉంది. సోమన్న కుమారుడు కార్తీక్ ఇటీవల కాలంలో పాటలు రాస్తున్నాడు. తండ్రి యొక్క సాహిత్య వారసత్వాన్ని కొడుకు పునికి పుచ్చుకున్నాడు. కార్తీక్ రాసిన పలు పాటలు యూట్యూబులో అందుబాటులో ఉన్నాయి. 

తెలంగాణ ప్రాంతంలో ఇంటికి సుట్టరికం వొస్తే వారికి తాటికల్లు, సారాయి అందించి గౌరవించే సంప్రదాయం వుంది. విందు, వినోదాలలో ఆ సంప్రదాయం నేటికీ ప్రతిబింబిస్తుంది. దానిని సోషల్ స్టేటస్ గా నేడు చూస్తున్నారు. అదిగాక తాగటం వ్యసనంగా మారిన వారిని ఉద్దేశించి సోమన్న సహజ రీతిలో పాట రాశాడు. 
"బ్రాండి తాగితే బ్రతుకు నాశనం 
విస్కీ తాగితే విలువ నాశనం 
కల్లు తాగితే ఇల్లు నాశనం 
సార తాగితే సర్వనాశనం రా .." అన్నాడు 'అంతా సర్వనాశం' పాటలో. దాని ప్రభావం ఎలా ఉందో చెప్పాడు. 
" ఎవరు తాగిన ఏసి ప్రీమియం 
కడుతలేరు ఎల్ఐసి ప్రీమియం 
బిర్రుగా తాగితే బిందెలు పోతయ్ 
ఫుల్లుగా తాగితే పుస్తెల పోతయ్
ఊకే తాగితే ఉన్నది పోతది రా.. అన్నడీ జానపద కవి. చిన్న వయసులోనే వితంతువులుగా మారిన మహిళల సంఖ్య అధికంగా ఉంది. అందులో వితంతువు పింఛను పొందుతున్న వారిలో తాగుడుకు బానిసలై మృతి చెందిన వారి బాధితురాల్ల సంఖ్య తక్కువేమీ కాదు. మద్యం ప్రియుల దగ్గరే రచయిత ఆగిపోలేదు, గుట్క మహమ్మారిని కూడా తన పాటలో ఇలా ప్రస్తావించారు. 
" గట్కా తినే రోజులు పోయి.. 
 గుట్కా తినే రోజులు వచ్చే 
 తమలపాకులు పొయ్యి.. నేడు తంబాకులు వచ్చేను గదరా " అంటూ వాడుక భాషలో ఆహార అలవాట్లు గూర్చి చెప్పాడు. వాటి ఫలితంగా కుటుంబాల్లో ఏర్పడే కలహలను, వచ్చే రోగాలను వివరించాడు. రోగాలను తగ్గించుకోవడానికి వ్యసనాలు వదులుకొని గట్కా దగ్గరకు ప్రయాణం మొదలైందీప్పుడు. 

Read More సామాజిక సేవలలో ఇంజనీరింగ్ ప్రాజెక్టుల శిక్షణ

ప్రపంచ మానవాళిని భయంపికితుల్ని చేసింది కరోనా మహమ్మారి. ఆ వ్యాధి బారిన పడి లక్షలమంది ప్రాణాలు కోల్పోయారు. ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైంది. దానిగూర్చి ఈ సోమన్న కరోనా కాలంలో పాటలు రాశాడు.
" కరోనా వచ్చింది 
 కష్టాలు తెచ్చింది 
 కలవర పెడుతుంది 
 కంగారు పెడుతుంది " అన్నాడు. 
" వైరస్ లొస్తాయి 
అవి మైనస్ లవుతాయి
మాస్కులు మరవొద్దు 
రిస్కుల పడవొద్దు" హితవు పలికాడు. దానికి కొనసాగింపుగా మరొక పాటను రాశాడు. 
 " బయటకు రాకు బదనంగా తేకు
 సమిదవు కాకు నీ వాళ్లకు దూరం కాకు.. " అంటూ చైతన్య పరిచాడు. 

Read More యునైటెడ్ ఫ్రెండ్స్ ఫౌండేషన్ సేవలు అభినందనీయం..

 చరిత్రలో అనేక చారిత్రక విప్లవ, సామాజిక పోరాటాలకు పాటే ఆయువైంది. తెలంగాణ మలి దశ  ఉద్యమంలోనూ సోమన్న పాటలు రాసి తన పాత్రను సుస్థిర పరుచుకున్నాడు. 
" తెలంగాణ వచ్చేదాకా తెగించి కొట్లాడుడే
 తాడో పేడో తేలేదాకా తరిమి తరిమికొట్టుడే " అంటూ పల్లవించాడు. ఈ ప్రాంత చైతన్య స్ఫూర్తి ఆయన కలంలో కనిపిస్తుంది. తెలంగాణ ఉద్యమంలో విద్యార్థుల మహోన్నత పాత్రను వివరిస్తూ.. 
" ఉస్మానియా విద్యార్థులు ఉగ్రరూపమెత్తినారు     
  కాకతీయ విద్యార్థులు కథనమై సాగినారు   
  ఉయ్యాల పసిపిల్లలు ఉప్పెనవుతున్నారు  
  సచ్చిపోయే ముసలోళ్ళు సమిదలవుతున్నారు "
 ఉద్యమ ప్రవాహాన్ని, అనన్య త్యాగాలను అక్షరీకరించాడు సోమన్న. 

Read More ఎల్ ఓ సి చెక్కు అందజేత

తల్లి తండ్రి గొప్ప తనాన్ని చెబుతూ కనిపించే దేవుళ్ళు అమ్మా నాన్న అంటూ కొనియాడాడు. అమ్మ నాన్న పట్ల ప్రవర్తించే అమానవీయ తీరును ఇందులో వివరించాడు. 
" కనిపించే దేవుడు నాన్న 
 కానీ పెంచే దైవము అమ్మ 
నాన్న ఆరాధిస్తే గుడికి నువ్వు వెళ్లినట్లే 
అమ్మను పూజిస్తే ఆ బ్రహ్మను పూజించినట్టే అంటాడు. 
 " కొండలని ఎక్కుతావు 
 బండలని మొక్కుతావు 
గుండు గీసి హుండీలలో పైసలేని వేస్తావు
 నీ గుండెలోన దేవుడినే గుర్తించవు 
అమ్మకు అన్నం పెట్టవు 
రాతి దేవుడికి నైవేద్యం పెడతావు " అంటాడు అనంతోజు. తల్లి తండ్రులను నిర్లక్ష్యం చేసే కొడుకుల దుర్భుద్దిని కుండ బద్దలు కొట్టినట్లు చెప్పాడు. 

ఈ సమాజానికి బువ్వ బెట్టి ఆకలి తీరుస్తున్న రైతుపై సోమన్న హృదయం స్పందించిన తీరులో శ్రమ శక్తి విలువ, రాజ్య స్వభావం వుంది. 
 " రైతే రాజు అని అంటూనే
   ఆ రాజుకు సంకెళ్లు వేస్తిరి 
   రైతే వెన్నెముకంటిరి 
   ఆ రైతు కంటనీరు చూస్తిరి " రైతు బతుకును కండ్లకు గట్టాడు.  
" అప్పులు చేసి బోరులు వేసి 
 బోరులు ఫెయిల్ అయి 
 బోరున ఏడ్చి వడ్డీలు పెరిగి 
 నడ్డీలు విరిగి ఉన్నదంతా ఊసుకపోయే    
 ఆత్మహత్యలకే దారి తీసే
ఉరితాడే ఉయ్యాలా అయ్యేనా.. " అని ఈ కవి ఆందోళన చెందాడు. పంట సేద్యకుల గూర్చి చెప్పడంతో పాటు అక్షర సేద్యం చేస్తున్న వారినుద్దేశించి పాటలు సోమన్న కలం నుంచి వెలువడటం ఆయన గొప్ప తనమే అవుతుంది. 
" గన్ను కన్నా పెన్ను ఘనమైనదే 
 తూట కన్నా పాట బలమైనదే.." అంటూ కలం బలంలో కలం వీరుల గొప్పతనాన్ని ఈ లోకానికి చాటి చెప్పాడు. పాటలే కాకుండా కొన్ని మినీ కవితలు రాశాడు. ఈ అనంతోజుడి సాహిత్యం విశాలమైనది, తుది లేని అనంతానిది.   
                  
మామిండ్ల రమేష్ రాజా,
 రాష్ట్ర కన్వీనర్, జన సాంస్కృతిక మండలి 7893230218IMG_20240128_202152

Views: 15
Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

నాలుగు లేబర్ కోడ్ లు కార్మికులకు ఉరితాళ్ళు నాలుగు లేబర్ కోడ్ లు కార్మికులకు ఉరితాళ్ళు
        నాలుగు లేబర్ కోడ్ లు కార్మికులకు ఉరితాళ్లు. లేబర్ కోడ్ ల రద్దుకై 23 మహ.బాద్ లో రాష్ట్ర సదస్సును జయప్రదం చేయండి.    ఐఎఫ్ టియు
కాంగ్రెస్ విజయం
నీట్ పరీక్ష రద్దు చేయండి
రైతుల దగ్గర నిల్వ ఉన్న అదనపు పొగాకును కొనుగోలు చేయాలి: బడుగు వెంకటేశ్వర్లు
అంతర్జాతీయ యోగా దినోత్సవం శుభాకాంక్షలు
పదవులలో పాలకవర్గం
పదవులలో పాలకవర్గం బాధ్యతలు