కవిత అరెస్టును నిరసిస్తూ బిఆర్ఎస్ ధర్నా

మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు

కవిత అరెస్టును నిరసిస్తూ బిఆర్ఎస్ ధర్నా

*కవిత అరెస్టును నిరసిస్తూ బిఆర్ఎస్ ధర్నాIMG_20240316_123448 *

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవితను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే… బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఈడీ అధికారులు అరెస్ట్ చేయడాన్ని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తీవ్రంగా ఖండించారు.ఈ నేపథ్యంలో మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణ కేంద్రంలోని బస్టాండ్ సెంటర్లో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.ముందు ఈడి తరువాత మోడీ అనుకుంటూ నినాదాలు చేశారు.ఎర్రబెల్లి మాట్లాడుతూ..ప్రజా కోర్టులో కాంగ్రెస్, బీజేపీలకు శిక్ష తప్పదని హెచ్చరించారు. కోర్టు వేళలు ముగిసిన తర్వాత సోదాల పేరుతో వచ్చి అరెస్టు చేయడం సరికాదన్నారు.అయినా న్యాయ వ్యవస్థపై తమకు విశ్వాసం ఉందని. న్యాయ పోరాటం చేస్తామని ఎర్రబెల్లి స్పష్టం చేశారు.అదేవిధంగా ఈడీ అధికారుల తీరును తప్పుపట్టారు. కవిత అరెస్ట్ అక్రమం, అప్రజాస్వామికం అంటూ ధ్వజమెత్తారు. ఇది బీజేపీ, కాంగ్రెస్ కుట్ర అంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. బీజేపీ నాయకులు గత కొంతకాలంగా కవితను అరెస్టు చేస్తామని ఈడీ అధికారుల మాదిరిగా చెప్పుకుంటూ వచ్చారని ఎర్రబెల్లి తెలిపారు.కేసీఆర్‌‌ డిమోరలైజ్ చేయాలని బీజేపీ, కాంగ్రెస్ కలిసి కుట్ర పన్నాయని ఆరోపించారు. అయిని అరెస్టులు బీఆర్ఎస్‌కు కొత్తేమీ కాదని పేర్కొన్నారు. 14 ఏళ్లు పోరాడిన పార్టీ అని.. రాజకీయంగా,న్యాయ పరంగా పోరాటం చేస్తామని తెలిపారు. కవిత పిటిషన్‌ను ఈరోజు సుప్రీంకోర్టు మూడు రోజులు వాయిదా వేసిందని గుర్తుచేశారు. దేశ అత్యున్నత న్యాయస్థానం చెప్పిన మాటకు విరుద్ధంగా ఈడీ అరెస్టు చేయడం సరికాదన్నారు. అయినా మహిళల్ని సాయంత్రం ఆరున్నర గంటల తర్వాత అరెస్టు చేయడంపై కోర్టులో కేసు నడుస్తోందని వ్యాఖ్యానించారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్‌ను దెబ్బతీయడానికే కవితను అరెస్టు చేశారని ఆరోపించారు. గతంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులపై కేసులు, దాడులు జరిగాయని.. రాజకీయంగా కక్ష సాధింపులకు పాల్పడుతున్నారని ఎర్రబెల్లి దయాకర్ రావు ధ్వజమెత్తారు. ఈ కార్యక్రమంలో భారీ ఎత్తున పార్టీ కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.

Views: 75
Tags:

Related Posts

Post Comment

Comment List

Latest News

అస్మాతపూర్‌లో ఇందిరమ్మ ఇల్లు ప్రారంభించిన సర్పంచ్.. అస్మాతపూర్‌లో ఇందిరమ్మ ఇల్లు ప్రారంభించిన సర్పంచ్..
అస్మాతపూర్‌లో ఇందిరమ్మ ఇల్లు ప్రారంభం.. రంగారెడ్డి జిల్లా, మంచాల, మార్చి 07, న్యూస్ ఇండియా ప్రతినిధి: ఇందిరమ్మ ఇల్లును ప్రారంభిస్తున్న సర్పంచ్ మంథని శివ యాదవ్.. ఇబ్రహీంపట్నం...
వరంగల్ ప్రభుత్వ MGM హాస్పిటల్ లో దారుణం .సమస్యలకు నిలయంగా దవాఖాన
ప్రకాష్ నగర్ లో సందడి సందడిగా హోలీ రంగోలి
రేపటి భవిష్యత్తు వినూత్నంగా ఆలోచించే విద్యార్థులదే
జిల్లా పోలీసు హెడ్ క్వార్టర్స్ లో ఘనంగా హోలీ 
పార్లమెంట్ సభ్యులుగా మారిన డిగ్రీ మహిళ విద్యార్థులు
చంద్రగ్రహణం సందర్భంగా రేపు పెద్దమ్మ గుడి మూసివేత