బీమా డబ్బుల కోసం చనిపోయినట్లు తప్పుడు ధ్రువపత్రాలు
బీమా డబ్బులు కొట్టేయడానికి బతికుండగానే చనిపోయినట్లు తప్పుడు ధ్రువపత్రాలు సృష్టించాడు ఓ ప్రబుద్ధుడు. 40 లక్షల రుపాయలు అప్ననంగా కొట్టేయడానికి సిద్ధపడ్డాడు. చివరికి అసలు విషయం బయటపడడంతో కటకటాలపాలయ్యాడు. ఈ ఘటన నెల్లూరు జిల్లా గూడూరులో చోటుచేసుకుంది. పనీపాటలేకుండా జల్సాగా తిరిగే గులాబ్జానీ బాషాకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇన్సూరెన్స్ డబ్బులు నొక్కెయడానికి ఏజెంట్ల సహాయంతో నకిలీ ధృవపత్రాలు సృష్టించాడు. భార్య పోటోలు తీసుకోవడానికి ఇన్సూరెన్స్ ఏజెంట్ ఆమె ఇంటికి వెళ్లగా అసలు విషయం బయటపడింది. […]
బీమా డబ్బులు కొట్టేయడానికి బతికుండగానే చనిపోయినట్లు తప్పుడు ధ్రువపత్రాలు సృష్టించాడు ఓ ప్రబుద్ధుడు. 40 లక్షల రుపాయలు అప్ననంగా కొట్టేయడానికి సిద్ధపడ్డాడు. చివరికి అసలు విషయం బయటపడడంతో కటకటాలపాలయ్యాడు. ఈ ఘటన నెల్లూరు జిల్లా గూడూరులో చోటుచేసుకుంది.
పనీపాటలేకుండా జల్సాగా తిరిగే గులాబ్జానీ బాషాకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇన్సూరెన్స్ డబ్బులు నొక్కెయడానికి ఏజెంట్ల సహాయంతో నకిలీ ధృవపత్రాలు సృష్టించాడు. భార్య పోటోలు తీసుకోవడానికి ఇన్సూరెన్స్ ఏజెంట్ ఆమె ఇంటికి వెళ్లగా అసలు విషయం బయటపడింది. ఇంటికి వచ్చిన భర్త గులాబ్జానీ బాషాను నిలదీసింది.
భర్త మోసంపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. భార్య ఫిర్యాదుతో గులాబ్జానీ బాషాను అరెస్ట్ చేసిన పోలీసులు… అతనికి సహకరించినవారి కోసం దర్యాప్తు చేస్తున్నారు.
About The Author
ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది.
Comment List