అటవీ జంతువులను వేటాడుతుండగా పట్టుబడ్డ ఆరుగురు వేటగాళ్లు

వేటగాళ్ల నుండి బలమైన మారణ ఆయుధాలు స్వాధీనం

On
అటవీ జంతువులను వేటాడుతుండగా పట్టుబడ్డ ఆరుగురు వేటగాళ్లు

గన్ను, కత్తి, గొడ్డలి, బుల్లెట్,

IMG-20240407-WA0420కారుతో పాటు ఆరు సెల్ ఫోన్లు స్వాధీనం 

కేసు నమోదు చేసి కోర్టుకు తరలింపు 

తల్లాడలో విలేకరుల సమావేశంలో జిల్లా ఫారెస్ట్ అధికారి సిద్ధార్థ్ విక్రమ్ సింగ్

Read More తొర్రూరులో ఎంజీ1 ఈవీ స్కూటర్ల గ్రాండ్‌ లాంచింగ్‌...

అటవీ జంతువులను వేటాడుతుండగా కొంతమంది వేటగాళ్ళను కాపు కాసి పట్టుకున్నట్లు జిల్లా ఫారెస్ట్ అధికారి సిద్ధార్థ్ విక్రమ్ సింగ్ తెలిపారు. ఆదివారం ఖమ్మం జిల్లా తల్లాడలో డీఎఫ్ వో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తల్లాడ రేంజర్ పరిధిలోని చండ్రుగొండ మండలంలోని బెండాలపాడు బీటు పరిధిలోని అటవీ ప్రాంతంలో  శనివారం రాత్రి కొంతమంది వేటగాళ్లు జంతువులను వేటాడుతుండగా పట్టుబడ్డారని వివరించారు. ఉన్నతాధికారుల విశ్వసనీయ సమాచారం మేరకు బెండలపాడు అటవీ ప్రాంతంలో వేటగాళ్లు వచ్చారనే సమాచారంతో జిల్లా, తల్లాడ రేంజ్ పరిధిలో అధికారులు ఆ వేటగాళ్ళ కోసం దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో ఆంధ్రకు చెందిన హైదరాబాద్ లో ఉంటున్న నలుగురు వేటగాళ్లతోపాటు మరో ఇద్దరు స్థానికులను అరెస్టు చేసినట్లు తెలిపారు. హైదరాబాద్ కు చెందిన పుష్పాల సుగ్రీవు, వెంకట శ్రీకాంత్, బొడ్డన నారాయణరావు, తినురం విజయ్ నాగరాజు  తో పాటు స్థానికులు డేరంగుల మిధున్ కుమార్, బొర్రా సురేష్ లను అరెస్టు చేశామన్నారు. వారి వద్ద నుండి గన్ను, కత్తి, మల్టిపుల్ గొడ్డలి, బుల్లెట్, కారు, ఆరు సెల్ ఫోన్ లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ అటవీ ప్రాంతంలో జింకలు, చిరుత పులి తదితర అటవీ జంతువులు ఉంటాయని, వాటిని వేటాడేందుకు వచ్చినట్లు తెలిపారు. వీరికి మూడు సంవత్సరాల నుండి ఏడు సంవత్సరాల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉందని వెల్లడించారు. ఇప్పటికే ఆరుగురిని అదుపులోకి తీసుకొని కోర్టుకు రిమాండ్ చేయనున్నట్లు వెల్లడించారు. వేటగాళ్లు వస్తున్నారనే సమాచారంతో శని, ఆదివారాల్లో ప్రత్యేక పెట్రోలింగ్ చేయటం జరుగుతుందని తెలిపారు. లోకల్ గా ఉండే వారు కాకుండా హైదరాబాదు నుండి వేటగాళ్లు వస్తున్నారని వారిని పట్టుకున్నట్లు తెలిపారు. ఎవరైనా అటవీ జంతువులను వేటాడితే కఠిన శిక్షలు పడతాయని హెచ్చరించారు. ఈ అటవీ ప్రాంతంలో నిరంతరం గస్తీ ఏర్పాటు చేస్తున్నామని, ఎవరూ కూడా వన్యప్రాణులను వేటాడవద్దని సూచించారు. ఈ సమావేశంలో సత్తుపల్లి రేంజర్ లావణ్య, డిఆర్ఓ కెవి రామారావు, తల్లాడ రేంజ్ పరిధిలోని అటవీశాఖ అధికారులు పాల్గొన్నారు.

Read More మంగళ్పల్లిలో ఆక్రమణల తొలగింపు..

Views: 113
Tags:

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Related Posts

Post Comment

Comment List

Latest News

మంగళ్పల్లిలో ఆక్రమణల తొలగింపు.. మంగళ్పల్లిలో ఆక్రమణల తొలగింపు..
మంగళ్పల్లిలో ఆక్రమణల తొలగింపు.. రోడ్డు ఆక్రమణలను తొలగిస్తున్న జిహెచ్ఎంసి టౌన్ ప్లానింగ్ అధికారులు ఆదిభట్ల, ఆగస్టు 19 న్యూస్ ఇండియా ప్రతినిధి: మంగళ్పల్లిలో ప్రధాన రహదారిపై ఆక్రమణలపై...
గుడుంబా నిర్మూలనకు పోలీసుల కఠిన చర్యలు
తొర్రూరులో ఎంజీ1 ఈవీ స్కూటర్ల గ్రాండ్‌ లాంచింగ్‌...
గుడుంబా స్థావరాలపై పోలీసుల ఉక్కుపాదం
ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ మృతి ఘటనకు కారణమైన నిందితుల అరెస్ట్
న్యాయవాదిపై దాడిని నిరసిస్తూ తొర్రూరు బార్ అసోసియేషన్ విధుల బహిష్కరణ
తొర్రూరులో గుడుంబాపై పోలీసుల దాడులు