*కాంగ్రెస్‌ బిఅర్ఎస్ నాయకులకు మధ్య గొడవ* •బీఆర్‌ఎస్‌ కార్యకర్తలపై దాడి.

•తలపై కర్రతో కొట్టిన కాంగ్రెస్ నాయకులు.. •ఆసుపత్రికి తరలింపు.. ఐసియు చికిత్స... •ప్రభుత్వ భూమిలో అక్రమ తవ్వకాలు..అధికారుల జాడెక్కడ..

*కాంగ్రెస్‌ బిఅర్ఎస్ నాయకులకు మధ్య గొడవ* •బీఆర్‌ఎస్‌ కార్యకర్తలపై దాడి.

 

మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలంలోని మడిపెల్లి గ్రామంలో బీఆర్‌ఎస్‌ నాయకులపై కాంగ్రెస్‌ పార్టీ నాయకులు శనివారం దాడి చేశారు.బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. మడిపెళ్ళి గ్రామంలో మహమ్మద్ అక్బర్,దస్తగిరి మరియు ఇతర స్థానికులు కలిసి మోరం తవ్వకాలు జరుపుతుండగా అక్కడికి వచ్చిన కాంగ్రెస్ నాయకులు వెన్నం సోమిరెడ్డి,ఓలోవుల వెంకటేశ్వర్లు, ఇద్దరూ బాగా తాగి వచ్చి మహమ్మద్ అక్బర్ ను ఇక్కడ మొరం తవ్వకాలు జరపకూడదని ఒకవేళ నువ్వు తవ్వకాలు చేపడితే..కాంగ్రెస్ కండువా కప్పుకొని తవ్వకాలు జరుపుకొమ్మని  కాంగ్రెస్ నాయకులు చెప్పారని ఆరోపించారు. దీంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ మొదలై మహమ్మద్ అక్బర్ బాధితుడికి తలపై కర్రతో కొట్టగానే తీవ్ర రక్తస్రావం కావడంతో తొర్రూర్ పట్టణ కేంద్రంలోని స్వరూప్ కుమార్ ఆసుపత్రికి తరలించడం జరిగిందని బాధితుడి బార్య అవేదన వ్యక్తం చేశారు.బాధితుడు ఐసియులో చికిత్స పొందుతున్నాడని తెలిపారు.

*బిఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య ఘర్షణ*
గత ప్రభుత్వంలో బిఆర్ఎస్ నాయకులు మడిపల్లి కుంటలో అక్రమమురం తవ్వకాలు జరుపుకుంటూ ఇళ్లలోకి 800 చొప్పున ఒక ట్రిప్పు మొరం అమ్ముకుంటున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. కాగా ఇప్పుడు అదే కుంటలోని అక్రమ మోరం తవ్వకాలు జరుపుతున్న టిఆర్ఎస్ నాయకులు మహమ్మద్ అక్బర్, దస్తగిరీ ఇతర బిఆర్ఎస్ నాయకులు జరుపుతుండగా అక్కడకు కాంగ్రెస్ నాయకులు వెన్నం సోమిరెడ్డి,ఒలోవుల వెంకటేశ్వర్లు, వచ్చి తొర్రూర్ ఎమ్మార్వో కు మరియు అధికారులకు సమాచారం అందజేయగా అక్కడికి సెక్రటరీ వచ్చి అక్రమ తవ్వకాలను నిలిపివేశారు.గంట సేపు తవ్వకాలు నిలిపివేసి మరల మొరం తవ్వకాలు మొదలుపెట్టారు. గమనించిన కాంగ్రెస్ నాయకులు అక్కడ చేరుకొని మరల ఎందుకు తవ్వకాలు మొదలు పెట్టారని వాగ్వాదానికి దిగారు. దీంతో బిఆర్ఎస్ నాయకుల మధ్య కాంగ్రెస్ నాయకుల మధ్య వాగ్వాదంతో కొట్లాట జరిగింది కొట్లాటలో మహమ్మద్ అక్బర్ కు తలకాయ పగలడంతో ఆసుపత్రికి తరలించారు. దస్తగిరికి స్వల్ప గాయాలు అయ్యాయి.

*అధికారుల జడెక్కడ*
తొర్రూర్ మండలం పలు గ్రామాలలో  ప్రభుత్వ భూములలో అక్రమ మొరం తవ్వకాలు చేపట్టుతూ ఎలాంటి అనుమతులు లేకుండానే యథేచ్ఛగా ప్రభుత్వ భూమిలో తవ్వకాలు చేపడుతూ ప్రభుత్వ సంపదను కొల్లగొడుతున్నారు. అక్రమంగా మట్టిని తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. అక్రమ దందాను అడ్డుకోవాల్సిన అధికారులు అవసరం లేదనట్టు చూస్తున్నారు. ఇటు రెవెన్యూ అధికారులు మైనింగ్ అధికారులు ఇరిగేషన్ అధికారులు ఏమి పట్టనట్టు చూస్తున్నారు. కానీ అధికారుల కనుసైగల్లోనే ఈ దందా భారీగా నడుస్తుందని ఆరోపణలు పోలేదు.

Read More అక్రమాలపై అప్రమత్తంగా ఉండాలని జెబి ఇన్ ఫ్రా గ్రూప్ సూచన...

Views: 285
Tags:

Related Posts

Post Comment

Comment List

Latest News