ప్రతి ఒక్కరూ బాధ్యతగా మొక్కలను నాటాలి

వన మహోత్సవ కార్యక్రమాన్ని ప్రారంభించిన పాలకుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి

ప్రతి ఒక్కరూ బాధ్యతగా మొక్కలను నాటాలి

మహబూబాబాద్ జిల్లా తొర్రూర్ మండలంలోని ఫతేపురం గ్రామంలో గల స్థానిక మండల ప్రజా పరిషత్ ప్రాథమిక పాఠశాలలో సోమవారం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వనమహోత్సవం కార్యక్రమాన్ని స్థానిక ఎంపీడీవో సీలర్ సాహెబ్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాలకుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి పాల్గొని పాఠశాల ఆవరణంలో మొక్కలను నాటడం జరిగింది. తదనంతరం ఎంపీడీవో సీలార్ సాబ్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే యశస్విని రెడ్డి  మాట్లాడుతూ గ్రామంలోని ప్రతి ఒక్కరూ బాధ్యతగా మొక్కలు నాటాలని పిలుపునిస్తూ మానవ మనుగడకు చెట్లు చాలా అవసరమని తెలుపుతూ దేశం మరియు రాష్ట్రం సాంకేతిక పరంగా దినదిన అభివృద్ధి చెందుతున్న దృష్ట్యా దేశంలో కాలుష్యం పెరిగిపోతుందని దీనివల్ల ప్రజలు అనారోగ్యాలకు కారణం అవుతున్నారని పేర్కొంటూ కాలుష్య నివారణకు చెట్లను పెంచవలసిన అవసరం ఎంతైనా ఉందని రాబోయే తరం పుట్టబోయే పిల్లల ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవాలన్నా మనం పీల్చే గాలి స్వచ్ఛంగా ఉండాలన్న చెట్లు చాలా అవసరం అంటూ ప్రతిరోజు మొక్కలకు నీళ్లు పోసే విధంగా పిల్లలకు అలవాటు చేయాలన్నారు.మనం పర్యావరణాన్ని పరిరక్షించుకుంటే పర్యావరణం మనల్ని రక్షిస్తుందన్నారు. కాలుష్య రహిత నియోజవర్గం కోసం ప్రతి ఒక్కరూ తమ తమ గ్రామాలలో బాధ్యతగా మొక్కలు నాటాలని గ్రామ ప్రజలకు,యువతకు మరియు విద్యార్థులకు పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో జెడ్పిటిసి మంగళపల్లి శ్రీనివాస్,ఎంపీపీ తూర్పాటి చిన్న అంజయ్య, పంచాయతీరాజ్ రాష్ట్ర రూరల్  డెవలప్మెంట్ డైరెక్టర్ లింగాల వెంకటనారాయణ గౌడ్,కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు సుంచు సంతోష్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు మరియు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

Views: 112
Tags:

Related Posts

Post Comment

Comment List

Latest News

హెల్మెట్ పెట్టుకొని వాహనం నడుపుతానని ప్రతిజ్ఞ చేస్తున్న హెల్మెట్ పెట్టుకొని వాహనం నడుపుతానని ప్రతిజ్ఞ చేస్తున్న
డోర్నకల్ ఏప్రిల్ 14 న్యూస్: డోర్నకల్ మండలం వెన్నారం గ్రామంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్135 జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు.గ్రామ సర్పంచ్ జక్కుల కౌసల్య అంబేద్కర్ విగ్రహానికి...
ఇంటర్ ఫలితాలలో వెలాసిటీ కళాశాల విజయకేతనం
ఖమ్మంలో వెలాసిటీ కళాశాలలో ఎదురులేని ఫలితాలు
మహిళ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఘనంగా కళాశాల వార్షికోత్సవ వేడుకలు
ఆపదలో ఆపన్నహస్తం....!!
యువ నాయకత్వానికి ప్రతీక బంటి అన్న..
ఘనంగా బాబు జగ్జీవన్ రామ్ 119వ జయంతి ఉత్సవాలు..