నేటితో పీపుల్స్ మార్చ్ పాద‌యాత్ర‌కు ఏడాది - ఉప ముఖ్య‌మంత్రి భ‌ట్టి విక్ర‌మార్క

On
నేటితో పీపుల్స్ మార్చ్ పాద‌యాత్ర‌కు ఏడాది - ఉప ముఖ్య‌మంత్రి భ‌ట్టి విక్ర‌మార్క

ఉప ముఖ్య‌మంత్రి భ‌ట్టి విక్ర‌మార్క చేసిన పీపుల్స్ మార్చ్ పాద‌యాత్ర‌కు నేటితో ఏడాది పూర్తి. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆదేశాల‌తో నాడు సీఎల్పీ నేత‌గా భ‌ట్టి విక్ర‌మార్క త‌న పాద‌యాత్ర‌ను మార్చి 16న ఆదిలాబాద్ జిల్లా బోథ్ నియోజ‌క‌వ‌ర్గం పిప్పిరి నుంచి ప్రారంభ‌మైన పాదయాత్ర జులై 2న ఖ‌మ్మం న‌గ‌రంలో ముగిసింది. నాడు నిరాశలో నిండిన కాంగ్రెస్ పార్టీ కేడ‌ర్ లో భ‌ట్టి విక్ర‌మార్క చేప‌ట్టిన పాద‌యాత్ర స‌రికొత్త ఉత్సాహాన్ని నింపింది. 

భ‌ట్టి విక్ర‌మార్క చేప‌ట్టిన పీపుల్స్ మార్చ్ పాద‌యాత్ర మొత్తంగా 109 రోజులు పాటు కొన‌సాగింది. సుమారు 700కు పైగా గ్రామాల మీదుగా భ‌ట్టి విక్ర‌మార్క 1364 కిలోమీట‌ర్లు న‌డిచారు. పాద‌యాత్ర మొత్తంగా 17 జిల్లాల్లో 36 నియోజ‌క‌ర్గాల మీదుగా కొన‌సాగింది. ఈ పాద‌యాత్ర‌లో 100కు కార్న‌ర్ మీటింగ్స్, మంచిర్యాల‌, జ‌డ్చెర్ల‌, ఖ‌మ్మంల‌లో భారీ బ‌హిరంగ స‌భ‌లు జ‌రిగాయి. మంచిర్యాల స‌భ‌కు ఏఐసీసీ అధ్య‌క్షుడు మ‌ల్లిఖార్జున ఖ‌ర్గే, ఖ‌మ్మం బ‌హిరంగ స‌భ‌కు ఏఐసీసీ అగ్ర‌నేత రాహుల్ గాంధీ ముఖ్యతిధులుగా హాజ‌ర‌య్యారు. 

అప్ప‌టి వ‌ర‌కూ ఎవ‌రూ వెళ్ల‌డానికి సాహ‌సించ‌ని మ‌రుమూల గ్రామాలు, కొండ‌ల్లో, అడ‌వుల్లో నివాస‌ముండే ఆదివాసులు గూడాలు, గిరిజన తాండాల ప్ర‌జ‌ల‌ను భ‌ట్టి విక్ర‌మార్క ఈ పాద‌యాత్ర‌లో క‌లిసి... వారికి బాధ‌ల‌ను క‌ష్టాల‌ను తెలుసుకోవ‌డం విశేషం. 

ఈ పాద‌యాత్ర‌లో ప్ర‌ధానంగా నీళ్లు, నిధులు, నియామ‌కాలు, ఆత్మ‌గౌర‌వం, స్వ‌రాష్ట్ర సాధ‌న‌లో ప్రాణాల‌ను అర్పించిన అమ‌రుల ఆశ‌యాల గురించి అడుగ‌డుగునా ప్ర‌జ‌ల‌తో చ‌ర్చించ‌డం.. వారినుంచి వ‌చ్చిన సానుకూల స్పంద‌న‌.. నిన్నటి శాస‌న‌స‌భ ఎన్నిక‌ల్లో ప్ర‌స్ఫుటంగా క‌నిపించింది. 

Read More ఘనంగా కేంద్ర రక్షణ సహాయ మంత్రి బండి సంజయ్ జన్మదిన వేడుకలు.

గ‌త ఏడాది డిసెంబ‌ర్ లో జ‌రిగిన సార్వ‌త్రిక శాస‌న‌సభ ఎన్నిక‌ల్లో.. పీపుల్స్ మార్చ్ పాద‌యాత్ర సాగిన మొత్తం 36 నియోజ‌క‌వ‌ర్గాల్లో కాంగ్రెస్ పార్టీ 26 చోట్ల ఘ‌న విజ‌యం సాధించింది. కాంగ్రెస్ పార్టీ గెలుపులో భ‌ట్టి విక్ర‌మార్క పాద‌యాత్ర ఎంత కీల‌కంగా మారిందో చెప్పేందుకో ఈ గ‌ణాంకాలే పెద్ద నిద‌ర్శ‌నం. 

Read More భారతీయ జనతా పార్టీ మండల నూతన కార్యవర్గం ఎన్నిక

పీపుల్స్ మార్చ్ పాద‌యాత్ర‌లో సీఎల్పీ నాయ‌కుడిగా భ‌ట్టి విక్ర‌మార్క.. అర్హులైన ప్ర‌తి నిరుపేద కుటుంబానికి రెండు గ‌దులు ఇందిర‌మ్మ ఇల్లు, పోడు భూముల అంశం, ధ‌ర‌ణి స‌మ‌స్య‌లు, పేద‌ల‌కు ఉచిత విద్యుత్, రూ.500కే గ్యాస్ సిలండ‌ర్, ఆరోగ్య శ్రీ విస్త‌ర‌ణ స‌హా ప‌లు అంశాల‌పై స్పందించారు. తెలంగాణ‌లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వ‌చ్చిన వెంట‌నే వాటి అమ‌లుకు చిత్త‌శుద్దితో నేడు కృషి చేస్తున్నారు. 

ఏదేమైనా తెలంగాణ‌లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వ‌చ్చేందుకు భ‌ట్టి విక్ర‌మార్క చేప‌ట్టిన పాదయాత్ర ఆశించిన‌దానికంటే మెరుగైన ఫ‌లితాల‌ను సాధించి పెట్టింది.

Views: 11
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News

మాదకద్రవ్యాల పై విద్యార్థులకు  అవగాహన కార్యక్రమం నిర్వహించిన ఎస్సై ప్రవీణ్ కుమార్ మాదకద్రవ్యాల పై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించిన ఎస్సై ప్రవీణ్ కుమార్
            చుంచుపల్లి  (న్యూస్ ఇండియా నరేష్) జూలై 18: చెడు అలవాట్లతో భవిష్యత్‌ నాశనమ వుతుందని, మాదకద్రవ్యాల నివారణకు సమష్టిగా కృషి చేయాలని చుంచుపల్లి ఎస్ఐ ప్రవీణ్
రైతు రుణమాఫీ అమలుకు పకడ్బందీ చర్యలు
మాదకద్రవ్యాల నిర్మూలన కోసం విద్యార్థులతో ర్యాలీ
ఏళ్ల చరిత్ర గల పీర్ల పండుగ...
భారతీయ జనతా పార్టీ మండల నూతన కార్యవర్గం ఎన్నిక
గంజాయి తరలిస్తున్న ముగ్గురుని అరెస్టు చేసిన టూ టౌన్ పోలీసులు
ఘనంగా కేంద్ర రక్షణ సహాయ మంత్రి బండి సంజయ్ జన్మదిన వేడుకలు.