టేక్మాల్ ఎస్సైగా బాధ్యతలు స్వీకరించిన రాజేష్
On
న్యూస్ ఇండియా (టేక్మాల్ ప్రతినిధి జైపాల్ సెప్టెంబర్ 6) మెదక్ జిల్లా టేక్మాల్ మండల ఎస్సైగా రాజేష్ బాధ్యతలను స్వీకరించారు. ఇటీవల జరిగిన బదిలీలో ఇక్కడ పనిచేసిన ఎస్సై మురళి మెదక్ రూరల్ బదిలీ అయ్యారు. మెదక్ ఏఆర్ లో ఉన్న రాజేష్ బదిలీపై టేక్మాల్ కు వచ్చారు. గురువారం బాధ్యతలను స్వీకరించిన ఆయన మాట్లాడుతూ శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ఎంతటివారైన ఉపేక్షించేది లేదని, శాంతి భద్రతల పరిరక్షణకు ప్రజలు సహకరించాలని కోరారు. గ్రామాల్లో అనుమానాస్పదంగా కొత్త వ్యక్తులు కనిపిస్తే పోలీసువారికి సమాచారం ఇవ్వాలి తప్ప దాడులకు పాల్పడకూడదన్నారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే శిక్షకు గురవుతారని చెప్పారు. రానున్న వినాయక చవితి, మిలాద్ ఉన్ నబి పండుగలను ప్రజలు ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని, గ్రామాల్లో శాంతిసామరస్యం నెలకొనాలని, ఇందుకోసం ప్రజలంతా సహకరించాలని సూచించారు.
Views: 11
About The Author
Related Posts
Post Comment
Latest News
14 Jun 2025 16:48:34
సంగారెడ్డి జిల్లా, బ్యూరో చీఫ్, జూన్ 14, న్యూస్ ఇండియా : క్రమశిక్షణతో విధులు నిర్వహించి, జిల్లా పోలీసు శాఖకు మంచి పేరు తీసుకురావాలని, పోలీస్ శాఖలో...
Comment List