మంత్రి తుమ్మల విజ్ఞప్తి మేరకు ఐ.టి శాఖ మంత్రి శ్రీధర్ బాబు ఆధ్వర్యంలో మున్నేరు వరద బాధితులకు నిత్యవసర సరుకుల కిట్లు అందజేత

 రూ. 3 కోట్లతో మొత్తం 10,000 కిట్లు అందజేసిన HYSEA .

On
మంత్రి తుమ్మల విజ్ఞప్తి మేరకు ఐ.టి శాఖ మంత్రి శ్రీధర్ బాబు ఆధ్వర్యంలో మున్నేరు వరద బాధితులకు నిత్యవసర సరుకుల కిట్లు అందజేత

కిట్లతో హైదరాబాద్ నుండి ఖమ్మంకు బయలుదేరిన వాహనాలు.

మంత్రి తుమ్మల గారి విజ్ఞప్తి మేరకు ఐ.టి శాఖ మంత్రి శ్రీధర్ బాబు గారి ఆధ్వర్యంలో మున్నేరు వరద బాధితులకు నిత్యవసర సరుకుల కిట్లు అందజేసిన హైదరాబాద్ సాఫ్ట్ వేర్ ఎంటర్ ప్రైజేస్ అసోసియేషన్.
-    రూ. 3 కోట్లతో మొత్తం 10,000 కిట్లు అందజేసిన HYSEA .
-    కిట్లతో హైదరాబాద్ నుండి ఖమ్మంకు బయలుదేరిన వాహనాలు.IMG-20240908-WA0405

హైదరబాద్: గత వారం కురిసిన భారీ వర్షాలకు మున్నేరు వాగు పొంగి ఖమ్మం పట్టణంలోని చాలా ప్రాంతాలు ముంపునకు గురి అయ్యాయి. ప్రజలు చాలా రకాలుగా నష్టపోయారు. ప్రభుత్వం అన్ని రకాలుగా ఆదుకుంటున్న సమయంలో ప్రైవేట్ సంస్థలు కూడా తమ వంతు బాధ్యతగా ప్రజలకు నిత్యవసర సరుకులు అందజేస్తు వారి మానవతా  దృక్పథాన్ని చాటుతున్నారు. వ్యవసాయశాఖ మంత్రి శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారి సూచనల మేరకు, ఐ.టి శాఖ మంత్రి శ్రీధర్ బాబు గారి ఆధ్వర్యంలో హైదరాబాద్ సాఫ్ట్ వేర్ ఎంటర్ ప్రైజేస్ అసోసియేషన్ వారు ఖమ్మం మున్నేరు వరద బాధితుల కోసం తమ సంస్థ తరపున నిత్యవసర కిట్లు అందచేయడం జరిగింది. రూ. 3000 విలువ చేసే ఈ కిట్లలో ప్రజలకు కావాల్సిన బియ్యం, పప్పులు, నూనే ప్యాకేట్లు, చక్కెర, ఉప్పు, కారం లాంటి నిత్యవసర సరుకులతో పాటు టవల్స్ కూడా కిట్లలో పెట్టి పంపడం జరిగింది. మొత్తం 3 కోట్ల రూపాయలతో 10,000 కిట్లను ఈ రోజు సెక్రటేరియేట్ ప్రాంగణం నుంచి ఖమ్మంకి వాహనాలు బయలుదేరడం జరిగింది. ఖమ్మంకు చేరిన  వెంటనే ఈ కిట్లను వరద భాదితులకు సక్రమంగా అందేలా ఏర్పాట్లు చేసుకోవాల్సిందిగా జిల్లా అధికారులను మంత్రి తుమ్మల ఆదేశించారు. ఈ సందర్భంగా మంత్రిగారు మాట్లాడుతూ, ఇలాంటి క్లిష్ట సమయంలో మంత్రి శ్రీధర్ బాబు గారి చొరవతో కిట్లు సరఫరా చేయడానికి ముందుకు వచ్చిన HYSEA ప్రతినిధులకు ప్రభుత్వం తరపున,  ఖమ్మం ప్రజల తరపున ధన్యావాదాలు తెలియజేయడం జరిగింది. ఈ  ఆపత్కాలంలో మరిన్ని ప్రైవేట్ సంస్థలు, దాతలు ముందుకు వచ్చి ప్రజలను ఆదుకోవడములో ప్రభుత్వానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

Views: 18
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News

'సంగారెడ్డి' పరువు తీస్తున్న అవినీతి 'సంగారెడ్డి' పరువు తీస్తున్న అవినీతి
సంగారెడ్డి జిల్లా, బ్యూరో చీఫ్, జూన్ 23, న్యూస్ ఇండియా : కొంత మంది 'అవినీతి అధికారుల కక్కుర్తి పనులవల్ల' సంగారెడ్డి పట్టణం పరువు పోతుందని, చాల...
అంతర్జాతీయ యోగా దినోత్సవం.
పెద్దకడుబూరు మండలంలో ఘనంగా జరిగిన అంతర్జాతీయ యోగా దినోత్సవం వేడుకలు...
మభ్యపెట్టే నైపుణ్యం, సృజనాత్మకమైన దోపిడీ ‘సెయింట్ ఆంథోనీస్ విధానం’
ప్రభుత్వ ఆదాయానికి గండి, పరోక్ష దోపిడీకి సిద్ధం!
'ఇండ్లు' లేకున్నా 'ఇంటి నెంబర్' లు అమ్మబడును!
నిరంతరాయ విద్యుత్ సరఫరాకు పటిష్ట చర్యలు... డిప్యూటీ సి.ఎం. భట్టి విక్రమార్క మల్లు