గణేష్ మహారాజ్ కి జై - బాయ్... బాయ్... గననాయక....!

- పెద్దకడుబూరులో ప్రశాంతంగా ముగిసిన గణేష్ నిమర్జన ఉత్సవం...

On

- ఎస్ఐ నిరంజన్ రెడ్డి బందోబస్తులో ప్రశాంతంగా గణేష్ నిమర్జనం.

న్యూస్ ఇండియా ప్రతినిధి/ పెద్దకడుబూరు మండలం సెప్టెంబర్ 09 :- వినాయక చవితి సందర్బంగా శనివారం నుంచి సోమవారం వరకు మూడు రోజులపాటు జరిగిన గణేష్ ఉత్సవాలను పెద్దకడుబూరు మండలం ప్రజలు ఘనంగా జరుపుకున్నారు.IMG_20240909_203319    మండల కేంద్రమైన పెద్దకడుబూరు గ్రామంలో దాదాపు 25 గణేష్ విగ్రహాలు కొలువుదీరాయి. మూడు రోజుల పాటు భక్తులు గణేష్ మహారాజ్ విగ్రహంనకు ప్రత్యేక మండపాలు ఏర్పాటు చేసి , మండపంలో వివిధ రకాల ఫోకస్ లైట్లు అమర్చి, పూలమాలలతో అందంగా అలంకరించారు. మూడు రోజుల పాటు భక్తులు తెల్లవారుజామునే మేల్కొని గణేష్ మహారాజ్ కు అనేక రకాల నైవేద్యములు , పండ్లు , పూలు సమర్పించి గణేష్ భక్తి నామాలు స్మరించుకుంటూ ఘనంగా ప్రత్యేక పూజలు చేపట్టారు. భక్తులు చేపట్టిన పూజ కార్యక్రమం అనంతరం వారికున్న కష్టాలను తొలగించి జీవితంలో సుఖసంతోషాలు ప్రసాధించమని , పాడిపంటలను సంరక్షకించి, పొలాల్లో వేసిన పంటలు బాగా పండి అధిక దిగుబడులు వచ్చేట్టుగా చూడాలని , ప్రతి ఒక్క కుటుంబంలోను సుఖశాంతులతో చల్లగా ఉండేలా దీవించు దేవుడా అంటూ గణేష్ మహారాజ్ యొక్క ఆశీస్సులను కోరుతూ భక్తులు వారి మనస్సులలో ప్రత్యేకంగా ప్రార్ధించారు. వివిధ మండపాల్లో వినాయకుని విగ్రహం దగ్గర పెట్టిన లడ్డును చివరి రోజు (సోమవారం) వేలంపాట వేశారు. ఈ వేలంపాటలో బస్టాండ్ ఆవరణం తెరుబజారులోని వినాయకుని లడ్డు అధిక ధరకు 21వేల రూపాయలు పలికింది. వేలంపాటలో వినాయకుని లడ్డును దక్కించుకున్న మొట్రూ ఈరన్నకు మండపం నిర్వాహకులు లడ్డును సమర్పించిన వారిని శాలువాతో సన్మానించి ,బ్యాండుబాజాలతో ఊరేగింపుగా వారిని ఇంటికి చేర్చారు. అలాగే బస్టాండ్ ఆవరణంలోని మరో మండపంలో వినాయకుని లడ్డు 7వేల రూపాయలకు మొట్రూ చంద్ర వేలం పాటలో దక్కించుకున్నారు. వివిధ మండపాల్లో కూడా వినాయకుని లడ్డు పోటాపోటీగా వేలం పాట కొనసాగింది. చివరిగా సాయంత్రం 5గంటలకు నిమర్జనమంతరం గ్రామంలోని అన్ని మండపాలలోని గణేష్ విగ్రహాలను ఊరేగింపుగా గ్రామ చావిడి దగ్గరకు చేర్చి అక్కడి నుండి వరుసగా డీజె సౌండ్స్ తో విగ్రహాల ముందు చిందులు వేస్తూ , వివిధ రకాల రంగులతో ఒకరినొకరు పూసుకుంటూ , బాణసంచాలు పేలుస్తూ సంతోషంగా బస్టాండ్ ఆవరణం నుండి గ్రామ శివారులోని ఎల్ఎల్ సి పెద్ద కాలువకు చేరుకొన్నారు. అక్కడ ప్రశాంతంగా గణేష్ నిమర్జనం కార్యక్రమం జరిగింది. వినాయకుని నిమర్జనం వేడుకను చూడడానికి పెద్ద సంఖ్యలో గ్రామ ప్రజలు పాల్గొన్నారు. గణేష్ నిమర్జన కార్యక్రమం ప్రశాంతంగా జరగడానికి మధ్యాహ్నం నుండే ఎస్ఐ నిరంజన్ రెడ్డి తమ పోలీస్ సిబ్బందితో గట్టి బందోబస్తును ఏర్పాటు చేసారు. కార్యక్రమంలో ఎలాంటి అవంచనియా సంఘటనలు జరగకుండా నిమర్జనం పూర్తయేంత వరకు ఎస్ఐ దగ్గరుండి నడిపించడం జరిగింది....ఈ నిమర్జన కార్యక్రమం రాత్రి 9గంటలకు ముగిసింది.

Views: 115
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News

వైయస్సార్సీపి కర్నూలు జిల్లా యువజన విభాగం సెక్రటరీగా ఆర్. శివరామి రెడ్డి ఎన్నిక... వైయస్సార్సీపి కర్నూలు జిల్లా యువజన విభాగం సెక్రటరీగా ఆర్. శివరామి రెడ్డి ఎన్నిక...
పెద్దకడుబూరు మండలం / న్యూస్ ఇండియా ప్రతినిధి షబ్బీర్ షా జూలై 01 :-  వైయస్ఆర్సిపి రాష్ట్ర అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి...
నమ్మించి ఓట్లు దండుకున్న చంద్రబాబుకు బుద్ధి చెప్పాలి జగన్ సార్..!
పెద్దకడుబూరు మండలం : డ్రైనేజీలు, వీధిలైట్లు మరియు త్రాగునిటీ సమస్యలు పరిష్కరించండి... సిపిఐ
రైతుల సంక్షేమమే మా ప్రభుత్వ ఉద్దేశం..
జిల్లాలో నెల రోజులపాటు 30, 30(ఎ) పోలీసు యాక్ట్ అమలు
జీవితాలను ఛిద్రం చేసిన 'సిగాచి ఫార్మా'
ఘనంగా ఐరిస్ ఫ్లోరేట్స్ వరల్డ్ స్కూల్ ప్రారంభం..