మాజీ మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డి సతీమణి శ్వేత మృతి

On
మాజీ మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డి సతీమణి శ్వేత మృతి

న్యూస్ ఇండియా (హైద్రాబాద్ ప్రతినిధి జైపాల్ సెప్టెంబర్ 10) బీఆర్ఎస్ నేత, టి జి మాజీ మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డి భార్య డాక్టర్ శ్వేత మరణించారు. కొద్దిరోజులుగా ఆమె తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. సోమవారం ఆరోగ్యం విషమించడంతో రాత్రి ఆసుపత్రిలో జాయిన్ చేశారు. కొద్ది గంటల వ్యవధిలో కన్నుమూశారామె. దీంతో లక్ష్మారెడ్డి ఇంట్లో విషాదం అలముకుంది. హోమియోపతి డాక్టర్ అయిన లక్ష్మారెడ్డి జడ్చర్ల నియోజకవర్గం నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 2014, 2018 ఎన్నికల్లో అదే నియోజకవర్గం నుంచి విజయం సాధించారు. ఆ తర్వాత కేసీఆర్ ప్రభుత్వంలో ఇంధన, ఆరోగ్యశాఖ మంత్రిగా పని చేశారు. గత ఎన్నికల్లో పోటీ చేసిన తక్కువ మెజార్టీతో ఓటమి పాలయ్యారు. అప్పటి నుంచి ఆ పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇంతలోనే లక్ష్మారెడ్డి భార్య చనిపోయారు. డాక్టర్ శ్వేత మరణం నేపథ్యంలో బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు సంతాపం తెలిపారు.

Views: 13

About The Author

Post Comment

Comment List

Latest News

'సంగారెడ్డి' పరువు తీస్తున్న అవినీతి 'సంగారెడ్డి' పరువు తీస్తున్న అవినీతి
సంగారెడ్డి జిల్లా, బ్యూరో చీఫ్, జూన్ 23, న్యూస్ ఇండియా : కొంత మంది 'అవినీతి అధికారుల కక్కుర్తి పనులవల్ల' సంగారెడ్డి పట్టణం పరువు పోతుందని, చాల...
అంతర్జాతీయ యోగా దినోత్సవం.
పెద్దకడుబూరు మండలంలో ఘనంగా జరిగిన అంతర్జాతీయ యోగా దినోత్సవం వేడుకలు...
మభ్యపెట్టే నైపుణ్యం, సృజనాత్మకమైన దోపిడీ ‘సెయింట్ ఆంథోనీస్ విధానం’
ప్రభుత్వ ఆదాయానికి గండి, పరోక్ష దోపిడీకి సిద్ధం!
'ఇండ్లు' లేకున్నా 'ఇంటి నెంబర్' లు అమ్మబడును!
నిరంతరాయ విద్యుత్ సరఫరాకు పటిష్ట చర్యలు... డిప్యూటీ సి.ఎం. భట్టి విక్రమార్క మల్లు