భార్య భర్త ఘర్షణలో అన్నదమ్ముల గలాట...!
ఘటనలో దాడికి పాల్పడిన పలువురు వ్యక్తులపై కేసు నమోదు.
-పెద్దకడుబూరు మండలం ఎస్ఐ పి.నిరంజన్ రెడ్డి వెల్లడి.*
న్యూస్ ఇండియా ప్రతినిధి/ పెద్దకడుబూరు మండలం సెప్టెంబర్ 18 :- కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గం పెద్దకడబూరు మండలం పరిధిలో చిన్నకడబూరు గ్రామానికి చెందిన హైమావతి భర్త లింగమూర్తి అను ఆమెను నిన్న రాత్రి 7 గంటల సమయంలో ఆమె భర్త కొట్టి ఇంటి నుండి పంపి వేసినాడు అని తర్వాత ఆమె యొక్క తండ్రి దశరథ రామ్ రెడ్డి మరియు అన్నలు హనుమంత రెడ్డి, రామిరెడ్డి లు బావమర్ది అయినా లింగమూర్తి ఇంటి వద్దకు వచ్చి ఎందుకు మా పాపను కొట్టి మా ఇంటికి పంపావు అని అడుగుతుండగా లింగమూర్తి యొక్క అన్నదమ్ములు రామిరెడ్డి, రామలింగారెడ్డి, హనుమంత్ రెడ్డి మరియు లక్ష్మిరెడ్డిలు వారిని కొడవలితో దాడి చేసి వారిని కాలు, చేతులపై కొట్టి గాయపరిచినరని దశరధి రామిరెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయడం జరిగిందని స్థానిక ఎస్ఐ పి.నిరంజన్ రెడ్డి బుధవారం విలేకరుల సమావేశంలో తెలిపారు.
Comment List