మూడో రోజు కొనసాగిన క్రికెట్ పోటీలు

మొదటి మ్యాచ్ లో మీడియా -1 విజయం

On
మూడో రోజు కొనసాగిన క్రికెట్ పోటీలు

రెండు మ్యాచ్ లో సింగరేణి, మూడో మ్యాచ్ లో పోలీస్ జట్టు విజయం

IMG20241110171640కొత్తగూడెం(న్యూస్ఇండియానరేష్)నవంబర్ 10: డాక్టర్ బి.ఎస్.రావు క్రికెట్ టోర్నమెంట్ మూడో రోజు కొత్తగూడెంలో ముచ్చటగా మూడు క్రికెట్ మ్యాచ్ లు కొనసాగాయి. మొదటి మ్యాచ్ మీడియా-1 జట్టు మరియు జ్యుడీషియల్ జట్టు మధ్య మ్యాచ్ కొనసాగింది. మీడియా-1 జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 191/6 పరుగులు సాధించి ,192 పరుగుల విజయ లక్ష్యాన్ని జుడిషియల్ జట్టు ముందు ఉంచింది. జుడిషియల్ జట్టు 135/8 పరుగులు సాధించి ఓటమిపాలైంది. మీడియా-1 జట్టు నుంచి మోషిన్ (90), శంకర్ (30) పరుగులు సాధించారు. జ్యుడిషియల్ జట్టు వినోద్ (23), పరుగులు సాధించరు.అనంతరం రెండో మ్యాచ్లో సింగరేణి జట్టు మరియు కలెక్టరేట్ జట్లు తలపడ్డాయి. మొదట బ్యాటింగ్ ఎంచుకున్న సింగరేణి జట్టు నిర్ణీత 20 ఓవర్లు ముగిసే సమయానికి 217/5 పరుగులు సాధించింది.218 పరుగుల విజయ లక్ష్యాన్ని కలెక్టరేట్ జట్టు ముందు ఉంచింది. అనంతరం బ్యాటింగ్ దిగిన కలెక్టరేట్ జట్టు146/9 పరుగులతో ఓటమి చవిచూసింది. సింగరేణి జట్టు తరఫున సాయి రాకేష్(53), లక్ష్మణ్(50) పరుగులు సాధించి సింగరేణి జట్టుకు మంచి స్కోర్ను అందించారు. కలెక్టరేట్ జట్టు నుంచి కార్తీక్ (22), పరుగులు సాధించి ఓటమి చవిచూసింది. మూడో మ్యాచ్ రుద్రంపూర్ జయశంకర్ మైదానంలో పోలీస్ మరియు ఫారెస్ట్ జట్లు పోటీ పడగా, తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పోలీస్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 193/7 పరుగులు సాధించిది. తర్వాత బ్యాటింగ్ చేసిన ఫారెస్ట్ జట్టు 132/7 పరుగులు సాధించి ఓటమి పాలైంది. పోలీస్ జట్టు నుండి హనుమ (36), సింగం (32) అత్యధిక పరుగులు చేయగా, ఫారెస్ట్ జట్టు నుండి నరసింహ (27) పరుగులు అందించారు. మ్యాచ్ ల అనంతరం మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా పోలీస్ జట్టుకు చెందిన హనుమాకు, సింగరేణి జట్టుకు చెందిన సాయి రాకేష్, మీడియా-1 జట్టుకు చెందిన మోషిన్ లకు టోర్నమెంట్ నిర్వాహకులు బిఎస్ రావు మరియు ఎస్ఐ నరేష్ వారి చేతుల మీదుగా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులను అందించారు. మంచి క్రీడా స్ఫూర్తితో వ్యాఖ్యతగా జాన్సన్ డేవిడ్ (బాబు) వ్యవహరించారు.

Views: 73
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News