బాధిత కుటుంబని పరామర్శించిన ఎమ్మెల్యే

On

న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక కొడకండ్ల ప్రతినిధి గుర్రం ప్రభాకర్ 
జనగామ జిల్లా కొడకండ్ల మండల కేంద్రం లో 
వివాహం ఆలస్యమవుతోందని ఆత్మహత్య చేసుకున్న యువతి  కుటుంబ సభ్యలను పాలకుర్తి శాసన సభ్యురాలు యశశ్విని రెడ్డి బుధవారం రాత్రి పరమర్శించారు జనగామ పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ గా పనిచేస్తున్న గుగులోతు నీలా (26) గత రెండు రోజుల క్రితం ఆత్మహత్య చేసుకున్న ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఈ విషాద ఘటనపై స్పందించిన స్థానిక ఎమ్మెల్యే యువతిని కుటుంబాన్ని పరామర్శించారు. కుటుంబ సభ్యులను ఓదార్చుతూ, యువతుల జీవితాల్లోని ఒత్తిడులు, అజ్ఞానం అప్రమత్తత  పెను సమస్యలుగా మారుతు యువత ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆమె ఆవేదన చెందారు 
"ఇలాంటి సంఘటనలతో బాధిత కుటుంబ సభ్యుల హృదయాన్ని కలిచివేస్తున్నాయి. ఆమె అన్నారు 
ఒక్క వివాహం కావడం లేదని జీవితాన్ని కోల్పోతే కుటుంబం లో ఎంతటి విషాదకరం ఉంటుందో బాధిత కుటుంబాలను చూస్తే అర్ధం అవుతుందన్నారు మన యువత మానసిక ధైర్యం ఇచ్చే సమాజంలో భాగస్వామ్యం కావాలన్నారు అందుకు ప్రతి ఒక్కరూ తల్లిదండ్రులు, పెద్దలు ఈ అంశాల్లో చైతన్యం కలిగి ఉండాలి  అని ఎమ్మెల్యే అన్నారు. నీల తనకు కూడ మహిళా గన్ మెన్ గా రావాలనుకుందని అయితే ఇంతలోనే ప్రాణం తీసుకోవడం తననేంతో కలిచివేసిందన్నారు 
 కుటుంబానికి ప్రభుత్వం తరఫున సహాయాన్ని అందిస్తామన్నారు. ఈ సందర్బంగా వ్యక్తిగత సహాయన్నదించి కుటుంబ సభ్యులను ఓదార్చారు
ఈ ఘటనపై ఎమ్మెల్యే చూపిన మానవత్వం పట్ల గిరిజన పెద్దలు అభినందనలు తెలిపారు,

Views: 1
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News

వైయస్సార్సీపి కర్నూలు జిల్లా యువజన విభాగం సెక్రటరీగా ఆర్. శివరామి రెడ్డి ఎన్నిక... వైయస్సార్సీపి కర్నూలు జిల్లా యువజన విభాగం సెక్రటరీగా ఆర్. శివరామి రెడ్డి ఎన్నిక...
పెద్దకడుబూరు మండలం / న్యూస్ ఇండియా ప్రతినిధి షబ్బీర్ షా జూలై 01 :-  వైయస్ఆర్సిపి రాష్ట్ర అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి...
నమ్మించి ఓట్లు దండుకున్న చంద్రబాబుకు బుద్ధి చెప్పాలి జగన్ సార్..!
పెద్దకడుబూరు మండలం : డ్రైనేజీలు, వీధిలైట్లు మరియు త్రాగునిటీ సమస్యలు పరిష్కరించండి... సిపిఐ
రైతుల సంక్షేమమే మా ప్రభుత్వ ఉద్దేశం..
జిల్లాలో నెల రోజులపాటు 30, 30(ఎ) పోలీసు యాక్ట్ అమలు
జీవితాలను ఛిద్రం చేసిన 'సిగాచి ఫార్మా'
ఘనంగా ఐరిస్ ఫ్లోరేట్స్ వరల్డ్ స్కూల్ ప్రారంభం..