కాంగ్రెస్ లో చేరిన టేక్మాల్ బీఆర్ఎస్ పార్టీ ఉపాధ్యక్షులు మహ్మద్ ఆరిఫ్

On
కాంగ్రెస్ లో చేరిన టేక్మాల్ బీఆర్ఎస్ పార్టీ ఉపాధ్యక్షులు మహ్మద్ ఆరిఫ్

 న్యూస్ ఇండియా అక్టోబర్ 23 (టేక్మాల్ ప్రతినిధి జైపాల్) టేక్మాల్ మండల బిఆర్ఎస్ పార్టీకి ఎదురుగాలి వీస్తుంది. మండలంలోని అన్ని గ్రామాల బీఆర్ఎస్, బిజెపి, బీఎస్పీ పార్టీల నుండి నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. ఆదివారం రోజు టేక్మాల్ మండల బిఆర్ఎస్ పార్టీకి ఎదురు దెబ్బ తగిలింది. టేక్మాల్ మండల పార్టీ అద్యక్షులు నిమ్మ రమేష్, మండల యువజన కాంగ్రెస్ అద్యక్షులు సంగమేశ్వర్ గౌడ్,కుసంగి గ్రామ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో మండలంలోని కుసంగి గ్రామానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ మండల ఉపాధ్యక్షులు సీనియర్ నాయకులు మండల మలి దశ ఉద్యమ కారుడు, బీఆర్ఎస్ పార్టీ ఉపాధ్యక్షులు మహమ్మద్ ఆరిఫ్ తో పాటు గ్రామానికి చెందిన గ్రామ పంచాయతీ 6 వ వార్డు సభ్యులు నాగరత్నం గౌడ్, గ్రామ ముదిరాజ్ సంఘం నాయకులు మాజీ వార్డు సభ్యులు పేరట్ల మొగులయ్య,(లడ్డు) కుంట మనయ్య, కుంట రమేష్, కురుమ సంఘం నాయకులు నాగమొల్ల శ్రీశైలం, పెద్దపురం యాదయ్య, ఎనగండ్ల ప్రవీణ్, పద్మశాలి సంఘం నాయకులు గొంటెల ఆశయ్య, కుమ్మరి సంఘం సభ్యులు కుమ్మరి రాజు, దళిత సంఘం సభ్యులు పీరిని మల్లేశం, బీజేపీ బూత్ కమిటీ సభ్యులు, రజక సంఘం నాయకులు చాకలి బుచ్చయ్య, బీఆర్ఎస్ పార్టీ సభ్యులు శ్రీధర్ రెడ్డిలు సిడబ్ల్యుసి శాశ్వత ఆహ్వానితులు, మాజీ ఉపముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. వీరికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ గారు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో కుసంగి గ్రామ కాంగ్రెస్ కమిటీ అద్యక్షులు సుబ్బారావు, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు చాకలి మాణిక్యం, మండల కో- ఆప్షన్ సభ్యులు షేక్ మజర్, మండల సీనియర్ నాయకులు మానిక్ కిషన్, కుసంగి గ్రామ సీనియర్ నాయకులు రామగళ్ల అంజయ్య, మాజీ ఉపసర్పంచ్ నారాయణ గౌడ్, దుర్గా గౌడ్, రాజు గౌడ్, పొట్ట రాజు, సుధాకర్ గౌడ్, మహేష్ రెడ్డి, మరియు తదితరులు పాల్గొన్నారు

Views: 18
Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

వైయస్సార్సీపి కర్నూలు జిల్లా యువజన విభాగం సెక్రటరీగా ఆర్. శివరామి రెడ్డి ఎన్నిక... వైయస్సార్సీపి కర్నూలు జిల్లా యువజన విభాగం సెక్రటరీగా ఆర్. శివరామి రెడ్డి ఎన్నిక...
పెద్దకడుబూరు మండలం / న్యూస్ ఇండియా ప్రతినిధి షబ్బీర్ షా జూలై 01 :-  వైయస్ఆర్సిపి రాష్ట్ర అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి...
నమ్మించి ఓట్లు దండుకున్న చంద్రబాబుకు బుద్ధి చెప్పాలి జగన్ సార్..!
పెద్దకడుబూరు మండలం : డ్రైనేజీలు, వీధిలైట్లు మరియు త్రాగునిటీ సమస్యలు పరిష్కరించండి... సిపిఐ
రైతుల సంక్షేమమే మా ప్రభుత్వ ఉద్దేశం..
జిల్లాలో నెల రోజులపాటు 30, 30(ఎ) పోలీసు యాక్ట్ అమలు
జీవితాలను ఛిద్రం చేసిన 'సిగాచి ఫార్మా'
ఘనంగా ఐరిస్ ఫ్లోరేట్స్ వరల్డ్ స్కూల్ ప్రారంభం..