చింతా ప్రభాకర్ ఆధ్వర్యంలో బి ఆర్ ఎస్ పార్టీ మేనిఫెస్టో విడుదల

On
చింతా ప్రభాకర్ ఆధ్వర్యంలో బి ఆర్ ఎస్ పార్టీ మేనిఫెస్టో విడుదల

సంగారెడ్డి నియోజకవర్గ బి.ఆర్.ఎస్ ఎం.ఎల్.ఏ అభ్యర్థి చింతా ప్రభాకర్ ఆధ్వర్యంలో బి. ఆర్.ఎస్ పార్టీ రానున్న ఐదు ఏళ్లలో చేయబోయే అభివృద్ధి పనులను 16 అంశాలతో కూడిన మేనిఫెస్టోను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో సంగారెడ్డి బిఆర్ఎస్ అభ్యర్థి చింతా ప్రభాకర్ తో పాటు టి ఎస్ ఎం ఐ డి సి చైర్మన్ ఎర్రల శ్రీనివాస్ , సంగారెడ్డి నియోజకవర్గ కోఆర్డినేటర్ పట్నం మాణిక్యం పాల్గొన్నారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ తెలంగాణ అభివృద్ధి కేవలం బిఆర్ఎస్ తోనే సాధ్యం అని  సదాశివపేట మరియు సంగారెడ్డి కి శాశ్వత నూతన టెక్నాలజీతో డంపింగ్ యార్డ్ మరియు ఈఎస్ఐ ఆసుపత్రిని ఏర్పాటు చేస్తామని అన్నారు. రైతుల కోసం కోల్డ్ స్టోరేజ్ లు, మహిళల కోసం జూనియర్ డిగ్రీ కాలేజీలు, మైనారిటీల కోసం రెసిడెన్షియల్ కాలేజీలను, అలాగే కళ్యాణ మండపాలను నిర్మిస్తామని అన్నారు. రవీంద్ర భారతి తరహాలో సంగారెడ్డి సదాశివ పేట్ లో ఏర్పాటు చేస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో కాసాల బుచ్చిరెడ్డి, నరహరి రెడ్డి, మనోహర్గౌడ్, విజేందర్ రెడ్డి, శ్రావణ్ రెడ్డి, మామిళ్ళ రాజేందర్,  శివరాజ్ పాటిల్ తదితరులు పాల్గొన్నారు.

Views: 11
Tags:

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Related Posts

Post Comment

Comment List

Latest News

తొర్రూరులో ఎంజీ1 ఈవీ స్కూటర్ల గ్రాండ్‌ లాంచింగ్‌... తొర్రూరులో ఎంజీ1 ఈవీ స్కూటర్ల గ్రాండ్‌ లాంచింగ్‌...
ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి ముఖ్యఅతిథిగా, భూమి చైర్మన్‌ ఎండీ రకమ్‌ సింగ్‌ రాణా, సినీ నటుడు హరీష్‌కుమార్‌ ప్రత్యేక అతిథులుగా, ఎంజీవన్‌ భూమి చైర్మన్‌, ఎండీ కొత్త...
గుడుంబా స్థావరాలపై పోలీసుల ఉక్కుపాదం
ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ మృతి ఘటనకు కారణమైన నిందితుల అరెస్ట్
న్యాయవాదిపై దాడిని నిరసిస్తూ తొర్రూరు బార్ అసోసియేషన్ విధుల బహిష్కరణ
తొర్రూరులో గుడుంబాపై పోలీసుల దాడులు
అంబర్‌పేట్‌లో 20 క్వింటాళ్ల  పీడీఎస్ బియ్యం స్వాధీనం..
మాకు ఈ టీచర్ వద్దు.. మా పిల్లల భవిష్యత్తును కాపాడండి