అమ్మాజీ నాయకత్వంలో జగనన్న ముందస్తు బర్త్ డే వేడుకలు
కేక్ కట్ చేసిన ఏపీ మాల కార్పొరేషన్ చైర్ పర్సన్ పెదపాటి అమ్మాజీ
అభిమానం ఉప్పొంగింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బర్త్ డే ఇంకా ఒక్కరోజు ఉండగానే అభిమానులు మందస్తు వేడుకలు జరిపారు. పాయకరావుపేట నియోజకవర్గంలో జరిగిన జగన్ అడ్వాన్స్ బర్త్ డే వేడుకలకు ఏపీ ఎస్సీ మాల కార్పొరేషన్ చైర్ పర్సన్ పెదపాటి అమ్మాజీ అధ్యక్షత వహించారు. అన్ని వర్గాలకు మేలు చేస్తున్న ఏకైక నాయకుడు జగనే అని ఈ సందర్భంగా అమ్మాజీ అన్నారు. అందుకే ఏపీ ప్రజలు మళ్లీ జగనే సీఎం కావాలని కోరుకుంటున్నారని చెప్పారు. జగన్ బర్త్ డే సందర్భంగా 2000 మందికి పైగా అన్నదానం 1000 మందికి పైగా వస్త్ర దానం జరిగింది. ఈ కార్యక్రమంలో పాయకరావుపేట నియోజకవర్గ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
About The Author
ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది.
Comment List