శ్రీరాజరాజేశ్వర స్వామిని దర్శించుకున్న హై కోర్ట్ జడ్జిలు

వేములవాడ, జనవరి27, న్యూస్ ఇండియా ప్రతినిధి

On
శ్రీరాజరాజేశ్వర స్వామిని దర్శించుకున్న హై కోర్ట్ జడ్జిలు

వేములవాడ శ్రీ రాజరాజేశ్వర ఆలయంలో స్వామివారిని హైకోర్టు జడ్జిలు శ్రీ టి మాధవి దేవి , శ్రీ జె శ్రీనివాసరావు లు శనివారం దర్శించుకున్నారు. అంతకుముందు రాజన్న ఆలయ గెస్ట్ హౌస్ వద్ద హైకోర్టు జడ్జిలు పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. సిరిసిల్ల, జగిత్యాల జిల్లాల జడ్జిలు శ్రీమతి ప్రేమలత, శ్రీమతి నీలిమ, అదనపు కలెక్టర్ శ్రీ ఖీమ్యానాయక్, శ్రీ అదనపు ఎస్పీ చంద్రయ్య, ఈఓ శ్రీ కృష్ణప్రసాద్ పుష్ప గుచ్చం అందజేసి స్వాగతం పలికారు. IMG_20240128_000233అనంతరం జడ్జిలకు ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో ఆలయంలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా జడ్జిలు రాజన్న సన్నిధిలో స్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు. న్యాయమూర్తులను ఆలయ అద్దాల మంటపంలో అర్చకులు ఆశీర్వదించి, స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. కార్యక్రమంలో  వేములవాడ ఆర్డీఓ శ్రీ మధుసూదన్, తహశీల్దార్ శ్రీ మహేష్ కుమార్ లు పాల్గొన్నారు. 

Views: 8
Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

వైయస్సార్సీపి కర్నూలు జిల్లా యువజన విభాగం సెక్రటరీగా ఆర్. శివరామి రెడ్డి ఎన్నిక... వైయస్సార్సీపి కర్నూలు జిల్లా యువజన విభాగం సెక్రటరీగా ఆర్. శివరామి రెడ్డి ఎన్నిక...
పెద్దకడుబూరు మండలం / న్యూస్ ఇండియా ప్రతినిధి షబ్బీర్ షా జూలై 01 :-  వైయస్ఆర్సిపి రాష్ట్ర అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి...
నమ్మించి ఓట్లు దండుకున్న చంద్రబాబుకు బుద్ధి చెప్పాలి జగన్ సార్..!
పెద్దకడుబూరు మండలం : డ్రైనేజీలు, వీధిలైట్లు మరియు త్రాగునిటీ సమస్యలు పరిష్కరించండి... సిపిఐ
రైతుల సంక్షేమమే మా ప్రభుత్వ ఉద్దేశం..
జిల్లాలో నెల రోజులపాటు 30, 30(ఎ) పోలీసు యాక్ట్ అమలు
జీవితాలను ఛిద్రం చేసిన 'సిగాచి ఫార్మా'
ఘనంగా ఐరిస్ ఫ్లోరేట్స్ వరల్డ్ స్కూల్ ప్రారంభం..