కొమురవెల్లి మల్లన్న ఆలయానికి అఘోరీ

ఆశ్చర్యంగా చూసిన భక్తులు

By Venkat
On
కొమురవెల్లి మల్లన్న ఆలయానికి అఘోరీ

మహిళా అఘోరి

IMG-20240907-WA0559

సాధారణంగా అఘోరాల గురించి చాలా మందికి తెలుసు. బంధాలు, అనుబంధాలను విడిచిపెట్టి హిమాలయాల్లో శివుడి కోసం తపస్సులు చేస్తూ జీవనం సాగిస్తుంటారు. అయితే అఘోరాల మాదిరిగానే అఘోరీలు కూడా ఉంటారని చాలా తక్కువ మందికి తెలుసు. అందుకే తాజాగా మన రాష్ట్రంలోని కొమురవెల్లి మల్లన్న ఆలయంలో అఘోరీ ప్రత్యక్షం కాగానే అందరూ ఆశ్యర్యంగా తిలకించారు.తెలంగాణ రాష్ట్రంలోని సిద్దిపేట జిల్లా కొమురవెల్లి గ్రామంలోని కొండపై ఈ ఆలయం ఉన్నది. కొమురవెల్లి మల్లికార్జున స్వామి దేవాలయంగా, కొమురవెల్లి మల్లన్న దేవాలయంగా ఈ ఆలయం ప్రసిద్ది చెందింది. ఇక్కడకు భక్తులు వేల సంఖ్యలో వస్తుంటారు. కొమురవెల్లి మల్లన్న స్వామిని బండ సొరికలో వెలసిన దేవునిగా కీర్తిస్తారు. సుతిమాను గుండు మీద త్రిశూలం ఉంటుంది. దాని ప్రక్కనే రేణుకా ఎల్లమ్మ దేవాలయం ఉంటుంది.ఈ ఆలయానికి 15 కిలోమీటర్ల దూరంలో పోచమ్మ దేవి ఆలయం ఉంది. మల్లన్న ఆలయానికి వచ్చిన వాళ్ళు ఇక్కడికి కూడా వచ్చి దర్శనం చేసుకుంటారు. తాజాగా మహిళా అఘోరీ కొమురవెల్లి దేవాలయానికి వచ్చింది. ఆమెను భక్తులు ఆశ్యర్యంగా చూశారు.

Views: 47
Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

రైతుల సంక్షేమమే మా ప్రభుత్వ ఉద్దేశం.. రైతుల సంక్షేమమే మా ప్రభుత్వ ఉద్దేశం..
రైతుల సంక్షేమమే మా ప్రభుత్వ ఉద్దేశం.. మార్కెట్లో దళారీ వ్యవస్థకు అవకాశం ఇవ్వం.. ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి.. బాటసింగారం పండ్ల వ్యవసాయ మార్కెట్ ఆవరణలో మొక్కను...
జిల్లాలో నెల రోజులపాటు 30, 30(ఎ) పోలీసు యాక్ట్ అమలు
జీవితాలను ఛిద్రం చేసిన 'సిగాచి ఫార్మా'
ఘనంగా ఐరిస్ ఫ్లోరేట్స్ వరల్డ్ స్కూల్ ప్రారంభం..
ప్రతి ఒక్కరూ తల సేమియా పిల్లలకు అండగా నిలవాలి..
ఎస్సి పెడరేషన్ ఆధ్వర్యంలో ఛత్రపతి సాహు మహరాజ్ 51 వ జన్మదిన వేడుకలు.*
చిన్నారులకు ఆధార్‌ అప్‌డేట్‌ తప్పనిసరి :కలెక్టర్ జితేష్ వి.పాటిల్