భూ సమస్యల పరిష్కారం కోసం లీపు సంస్థ కృషి అభినందనీయం.

తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ కమిషను చైర్మన్               ముదిరెడ్డి కోదండ రెడ్డి

On
భూ సమస్యల పరిష్కారం కోసం లీపు సంస్థ కృషి అభినందనీయం.

                                                              

భూమి సునీల్ ఖుషి మరువలేనిది...

WhatsApp Image 2024-09-11 at 4.57.03 PM

భూ సమస్యల పరిష్కారం కోసం లిప్ సంస్థ  తయారుచేసిన బుక్కును ఆర్డీవో కు అందజేత...

Read More జిల్లాలో నెల రోజులపాటు 30, 30(ఎ) పోలీసు యాక్ట్ అమలు

యాచారం సెప్టెంబర్ 11 న్యూస్ ఇండియా ప్రతినిధి:  
యాచారం మండలంను లిప్ సంస్థ పైలెట్ ప్రాజెక్టుగా తీసుకొని భూ సమస్యలపై అధ్యయనం చేసి నివేదిక తయారు చేయడం అభినందనీయమని తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ కమిషన్ చైర్మన్ ముదిరెడ్డి కోదన్ రెడ్డి అన్నారు. బుధవారం యాచారం గ్రామపంచాయతీ కార్యాలయం ఆవరణలో  రెవెన్యూ అధికారులు,రైతులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కోదండ రెడ్డి  మాట్లాడుతూ యాచారం మండలం దత్తత తీసుకొని పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసుకొని మండలంలోని 10 గ్రామాలలో భూ సమస్యలపై పూర్తిగా అధ్యయనం చేశారని అన్నారు. భూమి సునీల్ వారి బృందానికి కోదండ రెడ్డి ప్రత్యేకమైన అభినందనలు తెలిపారు. వారి అధ్యయనంలో గత ప్రభుత్వం తెచ్చిన ధరణితో అనేకమంది రైతులు ఇబ్బందులు పడ్డారని అన్నారు. ఎంతోమందికి పట్టాదారు పాసుబుక్ పుస్తకాలు రాక నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. ధరణి తప్పులు తడకగా ఉందని వారి అధ్యయనంలో వెళ్ళడైందని తెలిపారు. భూమి సునీల్  పైలట్ ప్రాజెక్టుగా తీసుకొని చేసిన ఈ అధ్యయనాన్ని ఈ నివేదికను తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయడానికి త్వరలో స్వీకారం చుట్టనున్నారని తెలిపారు. రైతులందరూ ఓపిక పట్టి సమస్యలు పరిష్కారం అయ్యే దిశగా అడుగులు వేస్తూ అధికారులకు పూర్తి సహకారాలు అందించాలని అన్నారు. అనంతరం భూమి సునీల్ మాట్లాడుతూ రైతుల సమస్యలను ప్రత్యేకమైన శ్రద్ధతో పరిష్కరించేందుకు తమ వంతుగా కృషి చేస్తామని అన్నారు. సర్వే అధ్యయనం సందర్భంగా గ్రామాల్లోని రైతులందరూ అధికారులు అందరూ సహకరించాలని అన్నారు వారందరికీ ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇబ్రహీంపట్నం ఆర్డిఓ అనంతరెడ్డి, యాచారం తహశీల్దార్ అయ్యప్ప, రెవెన్యూ అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు వుప్పల భాస్కర్ గుప్తా, వెంకట్ రెడ్డి, వివిధ గ్రామాల రైతులు తదితరులు పాల్గొన్నారు

Read More ఘనంగా ఐరిస్ ఫ్లోరేట్స్ వరల్డ్ స్కూల్ ప్రారంభం..

Views: 4
Tags:

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Post Comment

Comment List

Latest News

వైయస్సార్సీపి కర్నూలు జిల్లా యువజన విభాగం సెక్రటరీగా ఆర్. శివరామి రెడ్డి ఎన్నిక... వైయస్సార్సీపి కర్నూలు జిల్లా యువజన విభాగం సెక్రటరీగా ఆర్. శివరామి రెడ్డి ఎన్నిక...
పెద్దకడుబూరు మండలం / న్యూస్ ఇండియా ప్రతినిధి షబ్బీర్ షా జూలై 01 :-  వైయస్ఆర్సిపి రాష్ట్ర అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి...
నమ్మించి ఓట్లు దండుకున్న చంద్రబాబుకు బుద్ధి చెప్పాలి జగన్ సార్..!
పెద్దకడుబూరు మండలం : డ్రైనేజీలు, వీధిలైట్లు మరియు త్రాగునిటీ సమస్యలు పరిష్కరించండి... సిపిఐ
రైతుల సంక్షేమమే మా ప్రభుత్వ ఉద్దేశం..
జిల్లాలో నెల రోజులపాటు 30, 30(ఎ) పోలీసు యాక్ట్ అమలు
జీవితాలను ఛిద్రం చేసిన 'సిగాచి ఫార్మా'
ఘనంగా ఐరిస్ ఫ్లోరేట్స్ వరల్డ్ స్కూల్ ప్రారంభం..