అటహసంగా ప్రారంభమైన రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలు

పొంగులేటి జన్మదిన సందర్భంగా ప్రారంభమైన కబడ్డీ పోటీలు

On
అటహసంగా ప్రారంభమైన రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలు

భారీ ర్యాలీతో ప్రకాశం స్టేడియానికి చేరుకున్న క్రీడాకారులు

IMG20241028195639కొత్తగూడెం (న్యూస్ఇండియాబ్యూరో నరేష్) అక్టోబర్ 28: కొత్తగూడెంలో రాష్ట్ర రెవెన్యూ గృహ నిర్మాణ సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జన్మదినం పురస్కరించుకొని నిర్వహిస్తున్న రాష్ట్ర కబడ్డీ పోటీలను సోమవారం అటహాసంగా ప్రారంభించారు. ఓల్డ్ డిపో చౌరస్తాలో పొంగులేటి జన్మదిన సందర్భంగా కబడ్డీ క్రీడల జిల్లా కాంగ్రెస్ నాయకులు కంచర్ల చంద్రశేఖర రావు, నాగ సీతారాములు, కోనేరు చిన్ని, ఆళ్ళ మురళి, ఊకంటి గోపాలరావు, తదితర కాంగ్రెస్ నాయకులు భారీ కేకును కట్ చేశారు. అనంతరం భారీ ర్యాలీలో వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్, క్రీడాకారులు,కాంగ్రెస్ కార్యకర్తలు, పాల్గొని గణేష్ టెంపుల్ ,సూపర్ బజార్, బస్టాండ్ , పోస్ట్ ఆఫీస్ సెంటర్ మీదుగా ప్రకాశం స్టేడియంకు చేరుకున్నారు. అనంతరం దయాకర్ రెడ్డి క్రీడల పతాకావిష్కరణ ఆవిష్కరణ చేశారు. వివిధ జిల్లాల నుంచి వచ్చిన కబడ్డీ క్రీడాకారుల నుంచి ప్రముఖులు గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం ఈ ఎమ్మెల్యే జారే ఆదినారాయణ, వైరా ఎమ్మెల్యే రామదాస్ నాయక్, దయాకర్ రెడ్డి, మాట్లాడుతూ గ్రామీణ క్రీడగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎంతో ప్రాముఖ్యత ఉన్నదని , జిల్లా నుండి ప్రో కబడ్డీ పోటీలకు ప్రాతినిధ్యం వహించిన ఘనత మన జిల్లాకు ఉన్నది ఆని తెలిపారు . గ్రామీణ ప్రాంతం నుంచి అనేకమంది రాష్ట్ర జాతీయ కబడ్డీ క్రీడలలో పాల్గొన్న చరిత్ర మన భద్రాద్రి జిల్లాకుందన్నారు. కావున ఇంత ఆదరణ ఉన్నాయి క్రీడకు మన భద్రాద్రి జిల్లాలో పొంగులేటి శీనన్న పుట్టినరోజు సందర్భంగా ఈ రాష్ట్ర స్థాయి కబడ్డీ క్రీడలను నిర్వహించుకుంటున్నామన్నారు. మొదటిరోజు పురుషులకు భాగంలో ఖమ్మం వర్సెస్ మెదక్, అదిలాబాద్ వర్సెస్ మెదక్,మహిళల విభాగంలో వరంగల్ వర్సెస్ హైదరాబాద్ , ఖమ్మం వర్సెస్ మెదక్, పోటీలను ముఖ్య అతిథులు టాస్ వేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కంచర్ల చంద్రశేఖర రావు,నాగ సీతారాములు, కోనేరు చిన్ని, ఆళ్ళ మురళి, తుమ్ చౌదరి,కొత్వాల శ్రీనివాస్ ,సిపిఐ జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా, వైరా విజయ బాయ్, రజాక్, పీతాంబరం, దేవి ప్రసన్న, చీకటి కార్తీక్, స్వాతిముత్యం తదితరులు పాల్గొన్నారు.

 

Read More జీవితాలను ఛిద్రం చేసిన 'సిగాచి ఫార్మా'

Read More జిల్లాలో నెల రోజులపాటు 30, 30(ఎ) పోలీసు యాక్ట్ అమలు

Read More పెద్దకడుబూరు మండలం : డ్రైనేజీలు, వీధిలైట్లు మరియు త్రాగునిటీ సమస్యలు పరిష్కరించండి... సిపిఐ

 

 

 

 

Views: 126
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News

వైయస్సార్సీపి కర్నూలు జిల్లా యువజన విభాగం సెక్రటరీగా ఆర్. శివరామి రెడ్డి ఎన్నిక... వైయస్సార్సీపి కర్నూలు జిల్లా యువజన విభాగం సెక్రటరీగా ఆర్. శివరామి రెడ్డి ఎన్నిక...
పెద్దకడుబూరు మండలం / న్యూస్ ఇండియా ప్రతినిధి షబ్బీర్ షా జూలై 01 :-  వైయస్ఆర్సిపి రాష్ట్ర అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి...
నమ్మించి ఓట్లు దండుకున్న చంద్రబాబుకు బుద్ధి చెప్పాలి జగన్ సార్..!
పెద్దకడుబూరు మండలం : డ్రైనేజీలు, వీధిలైట్లు మరియు త్రాగునిటీ సమస్యలు పరిష్కరించండి... సిపిఐ
రైతుల సంక్షేమమే మా ప్రభుత్వ ఉద్దేశం..
జిల్లాలో నెల రోజులపాటు 30, 30(ఎ) పోలీసు యాక్ట్ అమలు
జీవితాలను ఛిద్రం చేసిన 'సిగాచి ఫార్మా'
ఘనంగా ఐరిస్ ఫ్లోరేట్స్ వరల్డ్ స్కూల్ ప్రారంభం..