ట్రాఫిక్‌ నిబంధనలను అతిక్రమించడంతో రోడ్డు ప్రమాదాలు సంభవిస్తున్నాయి: సిఐ కరుణాకర్

సెంట్రల్‌ వర్క్‌ షాప్‌లో రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమం

On
ట్రాఫిక్‌ నిబంధనలను అతిక్రమించడంతో రోడ్డు ప్రమాదాలు సంభవిస్తున్నాయి: సిఐ కరుణాకర్

IMG-20250108-WA1346కొత్తగూడెం(న్యూస్ ఇండియానరేష్)జనవరి 8:రోడ్డు ప్రమాదాలను అరికట్టేందకు ప్రతి ఒక్కరు తమ వంతు బాధ్యతగా రోడ్డు భద్రత నియమ, నిబందనలు పాటించాలని కొత్తగూడెం పట్టణ వన్‌ టౌన్‌ సిఐ కరుణాకర్‌  అవగాహన కార్యక్రమం నిర్వహించారు. జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవంలొ భాగంగా కొత్తగూడెం సెంట్రల్‌ వర్క్‌ షాప్‌లో పనిచేస్తున్న కార్మికులకు రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐ కరుణాకర్‌ మాట్లాడుతూ ఇప్పుడున్న పరిస్థితులలో వాహనాల రద్దీ అధికంగా పెరగడంతో రోడ్డుపై ట్రాఫిక్‌ సమస్యలు తలెత్తుతున్నాయని చెప్పారు. డ్రైవింగ్‌లో నైపుణ్యం సరిగా లేకపోవడం, ట్రాఫిక్‌ నిబంధనలను అతిక్రమించడంతో రోడ్డు ప్రమాదాలు సంభవిస్తున్నాయని స్పష్టం చేశారు. వాహనదారులు రోడ్డు ప్రమాదాల నివారణకు భద్రత విషయంలో తీసు కోవాల్సిన జాగ్రత్తలపై సూచనలు, సలహాలు అందించారు. వాహనాలు డ్రైవింగ్‌ చేసే సంయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పాటించాల్సిన నియమాలపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు. సెల్‌ఫోన్‌లో మాట్లాడుతూ డ్రైవింగ్‌ చేయరాదని, మితిమీరిన వేగం అతి ప్రమాదం అని, నిర్ధేశిత వేగాన్ని మించి వాహనాలను  నడపవద్దన్నారు. ఇతర వాహనా లకు ఇబ్బంది కలిగేలా వాహనాలను పార్కింగ్‌ చేయవద్దన్నారు. వాహనాలను ఓవర్‌ టేక్‌ చేస్తున్నప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని, సురక్షితంగా ప్రయాణికులను గమ్యస్ధానాలకు చేర్చాలని స్పష్టం చేశారు. ప్రయాణ సమయంలో వాహనదారులు ట్రాఫిక్‌ సిగ్నల్స్‌ పాటించాలన్నారు. ఈ కార్యక్రమాంలో ఎస్సై విజయ తోపాటు సింగరేణి అధికారులు, కార్మికులు, పోలీస్‌ సిబ్బంది పాల్గొన్నారు.

Views: 65
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News