శ్రీ వేంకటేశ్వర స్వామి దేవస్థానంలో శ్రీ పద్మావతి గోదా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వార్ల వింశ:(20వ) వార్షిక బ్రహ్మోత్సవం

On
శ్రీ వేంకటేశ్వర స్వామి దేవస్థానంలో శ్రీ పద్మావతి గోదా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వార్ల వింశ:(20వ) వార్షిక బ్రహ్మోత్సవం

శేరిలింగంపల్లి ( ఫిబ్రవరి 02) : న్యూస్ ఇండియా ప్రతినిధి కే.వినోద్ కుమార్ హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని నిజాంపేట్ రోడ్డు లోని సెవెన్ హిల్స్ కాలనీ లో గల శ్రీ వేంకటేశ్వర స్వామి దేవస్థానంలో శ్రీ పద్మావతి గోదా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వార్ల వింశ:(20వ) వార్షిక బ్రహ్మోత్సవం సందర్భంగా దాతల సౌజన్యంతో శ్రీ వేంకటేశ్వర స్వామి వారికి రజత(వెండి) కవచం ను దాతల సమక్షంలో కార్పొరేటర్ నార్నె శ్రీనివాసరావు , దేవాలయం ఈ ఓ సత్యనారాయణ మరియు భక్తులతో కలిసి స్వామి వారి బహుకరించి ప్రత్యేక పూజలు చేసిన పిఎసి చైర్మన్ ఆరెకపూడి గాంధీ. ఈ సందర్భంగా పిఎసి చైర్మన్ గాంధీ మాట్లాడుతూ శ్రీ వేంకటేశ్వర స్వామి వారికి దాతల సహకారంతో రజత కవచం ను అందచేయడం చాలా సంతోషకరమైన విషయం అని , రజత కవచం ను అందచేసిన దాతలను ఈ సందర్భంగా ప్రత్యేకంగా అభినదిస్తున్నాను అని పిఎసి చైర్మన్ గాంధీ తెలియచేశారు. వెంకటేశ్వర స్వామి వారి కృపా కటాక్షాలతో ప్రజలందరు సుఖ సంతోషాలతో ఉండలని, స్వామి వారి కృపా ప్రజలందరి పై ఉంటుంది అని పిఎసి చైర్మన్ గాంధీ తెలియచేశారు. ఈ కార్యక్రమంలో రజత ( వెండి) కవచం అందచేసిన దాతలు: 1 ప్రసాద్ - పద్మిని, 2.బాలు- మంజుల, 3.సాంబశివరావు- ఉషారాణి, 4.ఉమ శంకర్ - సుజాత మరియు నాయకులు కె ఆర్ కె రాజు, రాగ ప్రసాద్, పోతుల రాజేందర్, శ్రీ హరి, పద్మ ,సాంబ శివ రెడ్డి,అప్పిరెడ్డి, కిరణ్ కుమార్, కడియాల శివ ,సుజాత, నిఖిల్ మరియు భక్తులు తదితరులు పాల్గొన్నారు.

Views: 1
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News

వైయస్సార్సీపి కర్నూలు జిల్లా యువజన విభాగం సెక్రటరీగా ఆర్. శివరామి రెడ్డి ఎన్నిక... వైయస్సార్సీపి కర్నూలు జిల్లా యువజన విభాగం సెక్రటరీగా ఆర్. శివరామి రెడ్డి ఎన్నిక...
పెద్దకడుబూరు మండలం / న్యూస్ ఇండియా ప్రతినిధి షబ్బీర్ షా జూలై 01 :-  వైయస్ఆర్సిపి రాష్ట్ర అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి...
నమ్మించి ఓట్లు దండుకున్న చంద్రబాబుకు బుద్ధి చెప్పాలి జగన్ సార్..!
పెద్దకడుబూరు మండలం : డ్రైనేజీలు, వీధిలైట్లు మరియు త్రాగునిటీ సమస్యలు పరిష్కరించండి... సిపిఐ
రైతుల సంక్షేమమే మా ప్రభుత్వ ఉద్దేశం..
జిల్లాలో నెల రోజులపాటు 30, 30(ఎ) పోలీసు యాక్ట్ అమలు
జీవితాలను ఛిద్రం చేసిన 'సిగాచి ఫార్మా'
ఘనంగా ఐరిస్ ఫ్లోరేట్స్ వరల్డ్ స్కూల్ ప్రారంభం..