ఫస్ట్ ఏయిడ్ కిట్ పెట్టండి మహా ప్రభో ..
ఆర్ టి సి కి "మాచన" ప్రార్ధన
ఫస్ట్ ఏయిడ్ కిట్ పెట్టండి మహా ప్రభో
ఆర్ టి సి కి "మాచన" ప్రార్ధన..
నల్గొండ జిల్లా, ఏప్రిల్ 30, న్యూస్ ఇండియా ప్రతినిధి:- బస్సు ల్లో ఫస్ట్ ఏయిడ్ కిట్ లను ఏర్పాటు చేయాలని పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్మెంట్ డిప్యూటీ తాశిల్దార్,పొగాకు నియంత్రణ అంతర్జాతీయ అవార్డు గ్రహీత మాచన రఘునందన్ ఆర్టీసీ ని కోరారు.మంగళ వారం నాడు మాచన రఘునందన్ నల్లగొండ నుంచి హైద్రాబాద్ కు వెళ్లే క్రమం లో నాన్ స్టాప్ బస్ లో ప్రయాణిస్తున్నపుడు.. డ్రైవర్ సడన్ బ్రేక్ వేయడం వల్ల,బస్ మెట్ల పై పడ్డారు.తలకు తీవ్ర గాయమైంది.రక్త స్రావం జరిగింది.ఆ ఆపద సమయం లో బస్ లో ఎలాంటి ఫస్ట్ ఏయిడ్ కిట్ లేదు,దీంతో బస్ లో ఉన్న ప్రయాణికులే, రఘునందన్ తల నుంచి రక్త స్రావం జరగకుండా ప్రధమ చికిత్స చేశారు.టిస్యూ పేపర్లు అడ్డు పెట్టీ రక్త స్రావం కాకుండా ఎంతో సాయం చేశారు. అలా 20 కిలో మీటర్లు ప్రయాణించారు. ఎల్ బి నగర్ చేరాక ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స చేయించుకొన్నారు.అప్పటి వరకు ఆందోళన కర పరిస్థితి లో నే..ఉన్నారు. బస్సులో గనక ఫస్ట్ ఏయిడ్ కిట్ ఉండి ఉంటే..వెంటనే ప్రధమ చికిత్స కు అవకాశం ఉండేదని ప్రయాణానికులు అభిప్రాయపడ్డారు.దీంతో బుధవారం నాడు ఎక్స్ వేదిక గా ఆర్టీసీ బస్సు ల్లో కనీసం డీలక్స్, సూపర్ లగ్జరీ బస్సుల్లో ఫస్ట్ ఏయిడ్ కిట్ ఏర్పాటు చేయాల్సిందిగా రఘునందన్ ఆర్టీసీ ఎమ్ డి సజ్జనార్ ను కోరారు..

Comment List