హత్నూర, గుమ్మడిదల పోలీసు స్టేషన్ల ఆకస్మిక తనిఖీ.

On
హత్నూర, గుమ్మడిదల పోలీసు స్టేషన్ల ఆకస్మిక తనిఖీ.

స్టేషన్ రికార్డులు, హిస్టరీ షీట్స్ ఎలాంటి పెండింగ్ లేకుండా చూసుకోవాలి. కమ్యూనిటీ పోలిసింగ్ ద్వారా ఆన్లైన్ బెట్టింగ్స్, సైబర్ ఫ్రాడ్స్ గురించి ప్రజలలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి. యస్.హెచ్.ఒ వీలైనంత ఎక్కువ సమయంలో ప్రజలలో ఉంటూ, మన చుట్టూ జరుగుతున్న నేరాల గురించి అవగాహన కల్పించాలి. యస్.హెచ్.ఒ లకు పలు సూచనలు చేసిన జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ ఐపిఎస్.

సంగారెడ్డి జిల్లా, బ్యూరో చీఫ్, మే 05, న్యూస్ ఇండియా : సస్పెక్ట్స్ మరియు పాత నేరస్తులపై నిఘా ఉంచాలని, నైట్ బీట్, పెట్రోల్లింగ్ అధికారులు వీధి నిర్వాహణలో అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ సూచించారు. తేది: 05.05.2025 హత్నూర, గుమ్మడిదల పోలీసు స్టేషన్ల ను జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ ఐపిఎస్. ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పోలీసు స్టేషన్ల పరిసరాలు, బ్యారక్స్ పరిశుభ్రతను పరిశీలించారు. అనంతరం స్టేషన్ రికార్డ్లను తనిఖీ చేస్తూ.., అండర్ ఇన్వెస్టిగేషన్ కేసులు ఎలాంటి పెండింగ్ లేకుండా చూడాలని అన్నారు.  ప్రతి వర్టికల్ కు ఒక అధికారిని నియమించి, రికార్డ్స్ ఎలాంటి పెండింగ్ లేకుండా చూడాలని యస్.హెచ్.ఓ లకు సూచనలు చేశారు. ప్రతి కేసులో ప్రత్యేక ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉండాలని, సిబ్బంది అధికారులు స్టేషన్ కు వచ్చిన వారితో మర్యాదగా మాట్లాడాలని,  24*7 అందుబాటులో ఉంటూ శాంతి భద్రతల పరిరక్షణలో కృషి చేయాలని అన్నారు. హిస్టరీ షీటర్స్, సిబ్బంది వాహనాలు నడిపేటప్పుడు తప్పనిసరిగా సీట్, హెల్మెట్ ధరించాలని  సూచించారు. మన చుట్టూ జరుగుతున్న ఆన్లైన్ మోసాలు, బెట్టింగ్స్, బెట్టింగ్ యాప్స్ గురించి, రోడ్డు ప్రమాదాల గురించి కమ్యూనిటీ పోలీసింగ్ ప్రోగ్రామ్స్ ద్వారా జిల్లా ప్రజలలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని, రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రధాన కూడళ్లలో సిసి కెమెరాలను ఏర్పాటు చేయడం, తరుచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న ప్రాంతాలను బ్లాక్ స్పార్ట్ లు గుర్తించి, సూచిక బోర్డు లను ఏర్పాటు చేయించాలన్నారు.  యస్.హెచ్.ఒ వీలైనంత ఎక్కువ సమయంలో ప్రజలలో ఉంటూ, ప్రజలతో సత్ సంబంధాలను కలిగి ఉండాలని, మన చుట్టూ జరుగుతున్న నేరాల గురించి అవగాహన కల్పిస్తూ వారిని అప్రమత్తం చేయాలి అన్నారు. విజిబుల్ పోలిసింగ్ లో భాగంగా డ్రంక్ అండ్ డ్రైవ్, ఈ-పెట్టి కేసులు నమోదు చేయాలని యస్.హెచ్.ఒ లకు పలు సూచనలు చేశారు.WhatsApp Image 2025-05-05 at 7.26.02 PM

Views: 5
Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

వైయస్సార్సీపి కర్నూలు జిల్లా యువజన విభాగం సెక్రటరీగా ఆర్. శివరామి రెడ్డి ఎన్నిక... వైయస్సార్సీపి కర్నూలు జిల్లా యువజన విభాగం సెక్రటరీగా ఆర్. శివరామి రెడ్డి ఎన్నిక...
పెద్దకడుబూరు మండలం / న్యూస్ ఇండియా ప్రతినిధి షబ్బీర్ షా జూలై 01 :-  వైయస్ఆర్సిపి రాష్ట్ర అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి...
నమ్మించి ఓట్లు దండుకున్న చంద్రబాబుకు బుద్ధి చెప్పాలి జగన్ సార్..!
పెద్దకడుబూరు మండలం : డ్రైనేజీలు, వీధిలైట్లు మరియు త్రాగునిటీ సమస్యలు పరిష్కరించండి... సిపిఐ
రైతుల సంక్షేమమే మా ప్రభుత్వ ఉద్దేశం..
జిల్లాలో నెల రోజులపాటు 30, 30(ఎ) పోలీసు యాక్ట్ అమలు
జీవితాలను ఛిద్రం చేసిన 'సిగాచి ఫార్మా'
ఘనంగా ఐరిస్ ఫ్లోరేట్స్ వరల్డ్ స్కూల్ ప్రారంభం..