ఉగ్రవాదం పై కఠిన చర్యలు తీసుకోవాలి.
సంగారెడ్డి జిల్లా, బ్యూరో చీఫ్, మే 08, న్యూస్ ఇండియా : ఆపరేషన్ సింధూర్ ను ఫోరమ్ ఫర్ బెటర్ సంగారెడ్డి అధ్యక్షులు శ్రీధర్ మహేంద్ర స్వాగతించారు. పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదుల సంస్థల స్టావారాలపై భారత సైన్యం ‘ఆపరేషన్ సింధూర్’ ద్వారా దాడులు చేసి ఉగ్ర వాద స్టావారలను నెల మట్టం చేయడాన్ని స్వాగతిస్తున్నాం అని, రాబోయే రోజుల్లో సైన్యం తీసుకునే చర్యలకు భారత పౌరుల సంపూర్ణ మద్దతు ఉంటుందని అన్నారు. ఇటీవల పహాల్గం లో అమాయక పర్యాటకులపై ఉగ్రవాదులు చేసిన దాడిని యావత్ దేశం ఖండించింది ఇలాంటి దాడులు భవిష్యత్తు లో జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు. పాకిస్తాన్ ఉగవాదులను అడ్డం పెట్టుకొని భారత దేశంలో అశాంతి, అణిచ్చిత్తి చేసే కుట్రలు కుతంత్రాలు మానుకోవాలని, లేకుంటే భారత ప్రభుత్వం, సైన్యం పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదం పై కఠిన చర్యలు తీసుకుంటుందని హేచ్చరించారు. పాకిస్తాన్ భారత దేశం పై చేస్తున్న కుట్రలు, కుతంత్రాలను, దురగాతలను అంతం చేయడానికి భారత ప్రభుత్వం సైన్యం తీసుకునే చర్యలకు భారత పౌరుల మద్దతు ఉంటుందని అన్నారు.
Comment List